క్రైమ్/లీగల్

విదేశీ కరెన్సీ స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: మారు పేర్లతో పరిచయాలు చేసుకుంటూ అమాయకులతో పాటు చదువుకున్న యువకులు, వ్యాపారస్థులను బురిడీ కొట్టిస్తున్న మోసగాడు సిద్దిక్వి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. విదేశీ కరెన్సీని బదిలీ చేయడానికి పర్సెంటేజ్‌లను తీసుకుంటూ దందాలు చేయడాన్ని పోలీసుల దృష్టికి వచ్చింది. శుక్రవారం సైబరాబాద్ పోలీసులు సిద్దిక్విని అరెస్టు చేశారు. అతన్ని నుంచి భారీగా విదేశీ కరెన్సీ డాలర్లు, పిస్టల్, కార్లు, బంగారం, భూ దస్తావేజీలును స్వాధీనం చేసుకున్నారు. ఇండియన్ కరెన్సీ దాదాపు రూ. 40 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. గోవా రాష్ట్రానికి చెందిన సిద్దిక్వి చిన్నప్పటి నుంచి నేరాలు చేయడం అలవాటు మార్చుకున్నాడు. రాష్ట్రాలు, ప్రాంతాలను బట్టి తన పేర్లను మార్చుకుంటాడు. ఇతనిపై 20 కేసులు ఉన్నాయి. దక్షణాది రాష్ట్రాల్లో ఇతను అనేక మోసాలు చేశాడని పోలీసులు వెల్లడించారు. మహారాష్ట్ర ఎరవాడ జైలులో కొంత కాలం జైల్ జీవితాన్ని గడిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, మాదాపూర్ డిసిపి వేంకటేశ్వరరావు, సాట్ దయానందరెడ్డి, పురుసోత్తం, సిఐ వెంకటేశ్, రమణగౌడ్, ఎస్‌ఐ వెంకటేశ్, ప్రదీప్‌రెడ్డి పాల్గొన్నారు.