క్రైమ్/లీగల్

మరో మెడికో ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం చదువుతున్న గీతిక (19) అనే విద్యార్థిని స్థానిక శివజ్యోతినగర్‌లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న మరో విషాదకర ఉదంతం ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన డాక్టర్ శిల్ప ఆత్మహత్యకు వేధింపులే కారణమన్న ఆరోపణలపై సిట్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ విషాదం చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. కొందరు వైద్యులపై ప్రభుత్వం వేటు కూడా వేసింది. ఎంతో పేరున్న శ్రీ వేంకటేశ్వర మెడికల్ కళాశాల ఇటీవల కాలంలో వివాదాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. కడప జిల్లాకు చెందిన విజయభాస్కర్‌రెడ్డి, భార్య హరితాదేవిల కుమార్తె గీతికారెడ్డి (19) ఎంసెట్‌లో మంచి మార్కులతో ర్యాంకు సాధించి ఎస్వీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు దక్కించుకుంది. కుమార్తెకు తిరుపతిలో సీటు రావడంతో తల్లి హరితాదేవి స్థానిక శివజ్యోతినగర్‌లోని ఎస్వీఎస్ ఎన్‌క్లేవ్‌లో
గది అద్దెకు తీసుకుని బిడ్డకు అండగా ఉంటోంది. ప్రస్తుతం గీతికారెడ్డి రెండవ సంవత్సరం చదువుతోంది. మరో వారం రోజుల్లో పరీక్షలు ఉన్నాయి. అయితే గీతిక ఆదివారం సాయంత్రం 5 గంటలకు తన ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గీతిక ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదు. మానసిక ఒత్తిడి, వ్యక్తిగత కారణాలని ప్రచారం సాగుతోంది. గీతిక మరణవార్త తెలుసుకున్న జూడాలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. మెడికోలు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గీతిక మృతిపై తక్షణం విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం గీతిక మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కళాశాలకు తీసుకువచ్చారు. దీంతో జూడాలు అంతా ఒక్కసారిగా మార్చురీ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి విచారణ నిమిత్తం జాయింట్ కలెక్టర్ చంద్రవౌళిని సంఘటనా స్థలానికి పంపారు.
చిత్రం..ఆత్మహత్యకు పాల్పడిన గీతిక