క్రైమ్/లీగల్

ఇద్దరి ఫైనాన్స్ నిర్వాహకుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరుట్ల, ఆగస్టు 13: పేద ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకొని అధిక వడ్డీలకు అప్పులిస్తూ ఇబ్బందిపాలు చేస్తున్న కోరుట్ల పట్టణానికి చెందిన అన్నదమ్ములైన బాస భూమేశ్వర్, బాస రాజగంగారాం అనే అక్రమ ఫైనాన్స్ నిర్వాహకులను సోమవారం కోరుట్ల పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ సతీష్‌చందర్ రావు మాట్లాడుతూ భూమేశ్వర్, రాజగంగారాం వేరువేరుగా కోరుట్లలో కనకదుర్గా హైపర్చేస్, ఫైనాన్స్, కమల ప్రియా ఫైనాన్స్ కొంతకాలంగా ఎలాంటి అనుమతి లేకుండా కోరుట్ల పట్టణ, పరిసర గ్రామాల్లో డబ్బులు అవసరం ఉన్న వారికి భూమి పత్రాలు పెట్టుకొని అధిక వడ్డీలకు అప్పు లు ఇస్తున్నారని, వడ్డీలు చెల్లించలేని వారిని తీవ్ర భయాందోళనకు గురి చేస్తూ ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు తీసుకొని వడ్డీలపై వడ్డీలు ప్రజల వద్ద వసూలు చేస్తూ ఈనెల 10,11న కనకదుర్గ, కమల ప్రియా ఫైనాన్స్‌పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా కార్యాలయాల్లో కీలకమైన డాక్యూమెంట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అప్పటి నుంచి ఫైనాన్స్ నిర్వాహకులు తప్పించుకోవడం జరిగిందని సోమవారం బాస భూమేశ్వర్, రాజగంగారాంలు కోరుట్ల నుండి హైదరాబాద్ పారిపోయే క్రమంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద అరెస్టుచేసి వీరిరువురి వద్ద దస్తావేజ్‌లు రిజిస్ట్రార్లు, 14.71లక్షలు, మరొకరి వద్ద రూ. 5.83 లక్షలు నగదుతో పాటు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. వారిని సోమవారం కోర్టులో హాజరపర్చామని సీఐ వెల్లడించారు.
చిరు వ్యాపారులకు