క్రైమ్/లీగల్

కల్తీ ఆహార తయారీ కేంద్రంపై టాస్క్ఫోర్స్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 13: పేకాట, క్రికెట్ బెట్టింగ్‌లు, వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించే టాస్క్ఫోర్స్ రూటు మార్చింది. ప్రజారోగ్య భద్రతపై దృష్టి సారించే క్రమంలో కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలపై కొరడా ఝుళిపిస్తోంది. నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు ఆదేశాలతో టాస్క్ఫోర్స్ ఏసీపీ రాజీవ్‌కుమార్ నేతృత్వంలో సిబ్బంది సోమవారం కొత్తపేట పోలీస్టేషన్ పరిధిలోని పలు గోడౌన్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా కల్తీ ఆహార పదార్థాలతో ప్యాకెట్స్ తయారు చేస్తున్నట్లు సమాచారం రావడంతో కొత్తపేట కేఎల్ రావు నగర్ సిండికేట్ బ్యాంక్ కాలనీలోని ఆర్‌కే ప్రొడక్ట్స్ భవనంలోని తయారీ కేంద్రంలో సోదాలు జరిపారు. లైసెన్స్ లేకుండా పెద్దమొత్తంలో కల్తీ ఫుడ్ ప్రొడక్ట్స్ తయారీ, ప్యాకింగ్ చేస్తుండగా భారీ నిల్వలను గుర్తించారు. వీటిని కర్నాటక, సైబల్‌పూర్, కర్నూలు, హైదరాబాద్, తదితర ప్రాంతాల నుంచి తయారు చేసినట్లు ప్యాకెట్లపై ముద్రించి ఉండటం గమానార్హం. ఆర్‌కే ప్రొడక్ట్స్ పేరుతో నగర పరిసర ప్రాంతాల్లో వేర్వేరు ప్రదేశాల నుంచి ముద్రించినట్లుగా కూడా ఉండటాన్ని గుర్తించారు. కల్తీ ఆహార నిల్వలను సీజ్ చేసిన టాస్క్ఫోర్స్ అధికారులు ఆర్‌కే ప్రొడక్ట్స్ యజమాని ఒగ్గు మురళీకృష్ణ(54)తో పాటు తయారు చేస్తున్న సిబ్బంది ఒగ్గు రాధా(49), కక్కొల్లు వినోద్(32)లను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కల్తీ సరుకు విలువ సుమారు 10లక్షల వరకు ఉంటుందని తెలిపారు. మొత్తం సరుకును ఫుడ్ సేఫ్టీ, జీఎస్టీ, లీగల్ మెట్రాలజీ అధికారుల సమక్షంలో సీజ్ చేశారు. ఈ దాడుల్లో కొత్తపేట సీఐ మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.