క్రైమ్/లీగల్

ఇద్దరు గజదొంగల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 17: జల్సాలు, దుర్వ్యసనాలకు బానిసలైన గుంటూరు నగరానికి చెందిన ఇద్దరు యువకులు కార్లు, మోటారు సైకిళ్లు, బంగారు ఆభరణాలను చోరీ చేస్తూ గజదొంగలుగా మారారు. ఎట్టకేలకు నగరంపాలెం సిఐ శ్రీ్ధర్‌రెడ్డి, సీసీఎస్ సీఐలు రత్నస్వామి, ఆర్ సురేష్‌బాబుల నేతృత్వంలో నిందితులను అరెస్ట్‌చేశారు. శుక్రవారం నిందితుల వివరాలను అర్బన్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో అర్బన్ ఎస్‌పి సిహెచ్ విజయారావు వెల్లడించారు. గుంటూరు నగరం శ్యామలానగర్‌కు చెందిన యార్లగడ్డ హేమంత్‌చౌదరి, మారుతినగర్‌కు చెందిన గుమ్మడి హరీష్ తెలంగాణ రాష్ట్రంలో రెండు కార్లను చోరీ చేయడంతో పాటు, నగరంపాలెం పరిధిలో రెండు కార్లు, ఒక బుల్లెట్, పట్ట్భాపురం, కొత్తపేట, నల్లపాడు, లాలాపేట, పాత గుంటూరు, విజయవాడలోని భవానీపురం, ఒంగోలు, హైదరాబాద్ సరూర్ నగర్ తదితర ప్రాంతాల్లో కార్లు, మోటారు బైకులు, బంగారు ఆభరణాలు చోరీ చేశారు. గుంటూరు, హైదరాబాద్, ఒంగోలు, విజయవాడ ప్రాంతాల్లో తాళం వేసిన కార్లు, బైకులను చాకచక్యంగా తెరిచి అపహరించి, వాటిని అమ్ముకుంటూ జల్సా చేస్తున్నారు. 2017 నుండి ఇప్పటివరకు ఏ పోలీసుస్టేషన్ పరిధిలో దొరకకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో కన్నావారితోటలో చోరీచేసిన కారులో సుమారు 400 గ్రాముల బంగారు ఆభరణాలు ఉండగా ఆ కారు, బంగారంతో నిందితులు పారిపోయారు. ఈ కేసుపై ప్రత్యేక దృష్టిసారించిన సౌత్ డిఎస్‌పి పి సౌమ్యలత నిందితుల సమాచారాన్ని సేకరించాలని సీఐలను ఆదేశించారు. ఎట్టకేలకు వారిని శుక్రవారం చుట్టుగుంట సెంటర్‌లో పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా నిందితులను తమ నేరచరిత్రను అంగీకరించారు. నిందితుల నుండి 45 లక్షల రూపాయల విలువ చేసే 6 కార్లు, 13 మోటారు సైకిళ్లు, 400 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ ఎస్‌పి విజయారావు వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభకనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్‌పి అభినందించారు.