క్రైమ్/లీగల్

అత్యాచారం కేసులో సంచలనాత్మక తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉజ్జయిని (మధ్యప్రదేశ్), ఆగస్టు 21: బాలికపై అత్యాచారానికి పాల్పడిన పధ్నాలుగేళ్ల బాల నేరస్థుడికి కేసు విచారణ వచ్చిన ఏడు గంటల వ్యవధిలోనే జువెనైల్ కోర్టు శిక్ష విధించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇక్కడి జువైనల్ జస్టిస్ బోర్డు న్యాయమూర్తి త్రిప్తిపాండే తీర్పునిచ్చిన ఈ కేసు అత్యంత స్వల్ప వ్యవధిలో వేగవంతంగా నిందితుడికి శిక్ష విధించిన కేసుగా గణుతికెక్కింది. ఈ కేసులో సోమవారం నిందితుడికి న్యాయమూర్తి రెండేళ్ల శిక్ష విధించారు. ట్రయల్‌కు వచ్చిన ఏడు గంటల వ్యవధిలోనే కేసులో నిందితుడికి శిక్ష పడింది. ఈ నెల 15న ఘటన చోటుచేసుకోగా కేసు నమోదు, కోర్టులో వాదనలు, జడ్జిమెంటు ప్రొనౌన్స్‌మెంట్ తదితరాలకు ఐదు రోజుల వ్యవధి పట్టిందని పోలీసులు తెలిపారు. కేసు డైరీని తాము సోమవారం ఉదయం 10.45 గంటలకు కోర్టులో సమర్పించగా సాయంత్రం 6 గంటలకు కోర్టు తీర్పును వెలువరించిందని పోలీసులు చెప్పారు. 2012లో పోక్సో చట్టం తీసుకువచ్చిన తర్వాత ఇంత స్వల్ప వ్యవధిలో వేగవంతమైన తీర్పు వెలువడడం ఇదే తొలిసారి కావచ్చని వారన్నారు. ప్రభుత్వ న్యాయవాది దీపేంద్ర మాలూ ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో బాలికలపై అత్యాచారాలు తీవ్రస్థాయికి చేరాయని న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారని ఇలాంటివి పునరావృతం కాకుండా చేసేందుకే బాలుడికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు చెప్పారని వివరించారు. బాలుడు మధ్యప్రదేశ్ సియోనీ జిల్లాలోని రిమాండ్ హోంలో శిక్షను అనుభివించాలని కోర్టు తీర్పునిచ్చింది. కాగా ఉజ్జయిని పోలీసు సూపరింటెండెంట్ సచిన్ అతుల్కర్ ఈ సందర్భంగా కేసు పూర్వాపరాలను వివరించారు. ఈనెల 15న బాధిత బాలిక ఘాటియాగ్రామంలోని తన ఇంట్లో సహచర బాలికలతో కలిసి ఆడుకుంటుండగా నిందితుడు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడని తెలిపారు.