క్రైమ్/లీగల్

జీవో 550 చెల్లుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో వైద్య విద్య సీట్ల కౌనె్సలింగ్‌కు సంబంధించిన జీవో నెం. 550ను యథావిధిగా కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన జీవో నెంబరు 550 సరైందేనని, రాజ్యాంగ బద్ధంగానే ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అత్యున్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే ఉందని సుప్రీంకోర్టు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ కౌనె్సలింగ్ ఓపెన్ కేటగిరి సీటును వదులుకొని రిజర్వేషన్ కోటాలో మరో సీటును దక్కించుకున్నప్పుడు ఖాళీ చేసిన సీటును అదే రిజర్వేషన్‌కు చెందిన మరో విద్యార్థితో భర్తీచేయాలని ఉద్దేశించబడిన జీవో నెం. 550లోని పేరా 5 క్లాజ్ (2)ను ఉమ్మడి హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు తీర్పును తప్పుబట్టడంతో పాటు, బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసింది. హైకోర్టు అదేశాల్లోని క్లాజ్ 2 ప్రకారం రిజర్వేషన్ కోటా పెరుగుతుందనడంలో వాస్తవం లేదని, దాన్ని పక్కనపెట్టి యాథావిధిగా వైద్య విద్య ప్రవేశాలు కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. జీవో నెం.550 ప్రకారం వైద్య విద్య సీట్లకు జరిగే ప్రవేశాలకు గతంలో జరిగిన మాన్యువల్ విధానం సరైనదనిఐ, ప్రస్తుతం జరుగుతున్న ఆన్‌లైన్ విధానం వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలను అధిగమించేందుకు దానికి అనుగుణంగా ఈ జీవోకు సవరణలు చేయాలని స్పష్టం చేసింది. దీని కోసం సుప్రీంకోర్టు రెండు తెలుగు రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించింది. జీవో నెంబర్ 550 సామాజిక న్యాయానికి ఉద్దేశించబడిన వౌలిక సుత్రాన్ని సుప్రీంకోర్టు ఈ ఆ ఆదేశాల ద్వారా కాపాడినట్టయింది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోని వైద్య విద్య సీట్ల ప్రవేశాల కోసం ఎన్టీఆర్, కాళోజీ విశ్వవిద్యాయాలు ఇప్పటికే కౌనె్సలింగ్ పూర్తి చేసినందున, వాటి జోలికి వెళ్లాకుండా యాథావిధిగా కొనసాగించాలని ఆదేశించింది. ఈ తీర్పు వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై పూర్తి ఆదేశాలను త్వరలోనే ప్రకటిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని 551 విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు సీట్లు కోల్పోనున్నారు. జీవో 550పై ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు 16 మంది విద్యార్థులు, ఎన్టీఆర్, కాళోజీ విశ్వవిద్యాలయాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, ఇందిరా బెనర్జీతో కూడిన ధర్మాసనం వరుసగా రెండోరోజు శుక్రవారం విచారించింది. తెలంగాణ తరపున వికాస్‌సింగ్, ఆంధ్రప్రదేశ్ నుంచి బసవ ప్రభు పాటిల్, విద్యార్థుల తరపున అల్లంకి రమేష్, వీ కోటేశ్వరరావు వాదనలు వినిపించారు.