క్రైమ్/లీగల్

ఏటీఎంలో రూ.80 లక్షలు స్వాహా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఆగస్టు 24: ఏటీఎంలలో మోసాలకు పాల్పడిన కస్టోడియన్లు కటకటాల పాలయ్యారు. నగదు స్వాహాకు పాల్పడిన కస్టోడియన్లు వి.జగదీష్, సీహెచ్.కోటేశ్వరావు, ఎ.మునికృష్ణలను శుక్రవారం అరెస్ట్ చేసి, వారినుంచి రూ.4 లక్షల నగదు స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపరిచారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీస్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో డీ ఎస్పీ రాంబాబు వివరాలు వెల్లడించారు. ముంబైకి చెందిన రైటర్ సేఫ్‌గార్డు సంస్థ ఏటీఎంలలో నగదు పెట్టేందుకు ఎస్‌బీఐతోపాటు వివిధ బ్యాం కులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ నిర్వాహకులు ఏటీఎంలలో నగదును పెట్టేందుకు అవుట్‌సోర్సింగ్ కింద సిబ్బందిని నియమించుకు ని లావాదేవీలు చేపట్టింది. ఈ నేపథ్యంలో శ్రీసిటీ, తడ, సూళ్లూరుపేట, నాయుడుపేట, పెళ్లకూరు తదితర ప్రాంతాల్లో ఏటీఎంలలో నగదు లావాదేవీలకు క్యాష్ కస్టోడియన్లుగా 2010లో దొరవారిసత్రం మండలం వేనాటి మునిరెడ్డినగర్‌కు చెందిన చేను కోటేశ్వరరావు, నాయుడుపేట బేరిపేటకు చెందిన అరవాకం మునికృష్ణ, వడిశిల జగదీష్‌లను నియమించుకున్నారు. వీరు ఆరు నెలలుగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. రైటర్స్ సేఫ్ గార్డు సంస్థ నిర్వహించిన ఆడిట్‌లో అసలు విషయం బయటపడింది. రెండువారాల కిందట రైటర్ సేఫ్ గార్డు సంస్థ ప్రతినిధులు ఆడిట్ నిమిత్తం సూళ్లూరుపేటకు వచ్చినపుడు కోళ్లమిట్ట ప్రాంతంలోని ఏటీఎంలో రూ.16 లక్షలు తేడా వచ్చింది. ఆ సంస్థ నెల్లూరు జిల్లా మేనేజర్ కారుమంచి మోహన్‌కుమార్ సంబంధిత క్యాష్ కస్టోడియన్లను ప్రశ్నించగా విషయం బయటపడింది. దాంతో ఆయన ఈనెల 16న సూళ్లూరుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలో దిగటంతో కస్టోడియన్ల అసలు వ్యవహారం బయటపడింది. ఈ ముగ్గరు ఐదు ప్రాంతాల్లోని ఏటీఎంల నుంచి రూ.80 లక్షలు స్వాహా చేసినట్లు విచారణలో బయటపడింది. ఈ వ్యవహారంలో సంస్థ సిబ్బంది, బ్యాంకు అధికారుల పాత్ర ఉందా అనే కోణంలో కూడా విచారిస్తున్నామన్నారు.