క్రైమ్/లీగల్

జువైనల్ హోం నుంచి 11 మంది బాలురు పరారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్, ఆగస్టు 28: సైదాబాద్‌లోని ప్రభుత్వ బాలుర పరిశీలన గృహం (జువైనల్ హోం) నుంచి వరుసగా విద్యార్థులు పారిపోవడం పరిపాటుగా మారుతుంది. ముందస్తు భద్రతా చర్యలు చేపట్టకపోవడం పట్ల అధికారుల పని తీరుకు అద్దం పడుతుంది. అధికారుల పర్యావేక్షణ లోపంతోనే వరుస సంఘటనలు జరుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. సోమవారం రాత్రి సుమారు రాత్రి తొమ్మిది గంటల సమయంలో 11 మంది బాలురు కిటికీ గ్రిల్స్ తొలగించి గోడ దూకి పారిపోవడం తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈనెల 13న ఇదే తరహాలో ఆరుగురు పరారయ్యారు. అధికారులు, సిబ్బంది భద్రత కట్టుదిట్టం చేయకపోవడం గమనార్హం. గత మే నెలలో జరిగిన రెండు వేరు సంఘటనలలో 20 మంది బాలురు పారిపోవడం విదితమే. ఆ సమయంలో హడావిడి చేసిన అధికారులు అనంతరం చర్యలు చేపట్టకపోవడంతో బాలురు పరారీ సంఘటనలు తిరిగి పునారావృతమయ్యాయి. సోమవారం పారిపోయిన బాలురలో గత మే నెలలో పరారై తిరిగి పట్టుబడ్డవారు కావడం గమనార్హం. ఈ సంఘటనపై హోం అధికారులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత జువైనల్ సంక్షేమం డైరెక్టర్ శైలజ సెలవులల్లో ఉన్నారు. దీంతో ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ విజేంద్ర మంగళవారం సందర్శించారు.