క్రైమ్/లీగల్

అన్నదమ్ముల సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంఖవరం, సెప్టెంబర్ 6: రెండేళ్లుగా నెలకొన్న పాత కక్షల నేపథ్యంలో ఒక వివాహ వేడుక సందర్భంగా ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ ఇద్దరు అన్నదమ్ముల సజీవదహనానికి దారి తీసింది. ప్రత్యర్థుల దాడి నుండి తప్పించుకోవడానికి పెళ్లి ఇంట్లో తలదాచుకున్న సోదరులపై అత్యంత పాశవికంగా కిటికీ నుంచి పెట్రోలు పోసి, నిప్పంటించి సజీవదహనం చేశారు. తూర్పు గోదావరి జిల్లా శంఖవరంలో గురువారం మధ్యాహ్నం ఈ ఘోరం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం శంఖవరం గ్రామంలోని అంబేద్కర్ నగర్‌లో గురువారం జరిగిన ఒక వివాహ వేడుకలో బత్తిన నూకరాజు, పులి సుధాకర్ వర్గాల మధ్య చెలరేగిన వివాదం ఘర్షణకు దారి తీసింది. ఈసందర్భంగా నూకరాజు, అతని సోదరుడు ప్రసాద్ పులి సుధాకర్, మేడా రాజేంద్రప్రసాద్‌పై మారణాయుధాలతో దాడి చేసి, గాయపరిచారు. దీనితో ఆగ్రహించిన సుధాకర్ వర్గీయులు ఒక్కసారిగా నూకరాజు, ప్రసాద్‌పై దాడికి యత్నించారు. ప్రాణభయంతో సోదరులిద్దరూ వివాహం జరుగుతున్న కరకాటి నాగేశ్వరరావు ఇంట్లో తలదాచుకున్నారు. దీనిని గమనించిన ప్రత్యర్థులు తలుపులకు బయట గొళ్లెం పెట్టి, కిటికీ నుండి ఇంట్లోకి పెట్రోలు పోసి నిప్పంటించారు. దీనితో లోపల తలదాచుకున్న బత్తిన నూకరాజు(28), బత్తిన ప్రసాద్(25) మంటల్లో సజీవ దహనమయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా భీతావహ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో గ్రామానికి చేరుకున్నారు. అంబేద్కర్ నగర్‌లో రెండు వర్గాల మధ్య గత రెండేళ్లుగా జరుగుచున్న వివాదాల నేపథ్యంలో కక్షలు
నెలకొన్నాయని, ఈ కక్షలు మరింత ముదరడంవల్లే ఈ పరిణామానికి దారితీసిందని పెద్దాపురం డిఎస్పీ చిలకా వెంకట రామారావు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామన్నారు. కాగా పెద్దాపురం ఆర్డీవో వసంతరాయుడు, శంఖవరం తహసీల్దార్ సుజాత సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ జరిపారు. స్ధానికంగా నెలకొన్న పరిస్ధితులను ఉన్నతాధికారులకు నివేదించారు. కాగా ముందుజాగ్రత్తగా గ్రామంలో ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా సీఐలు అద్దంకి శ్రీనివాసరావు, చెన్నకేశవరావు, కాశీవిశ్వనాథ్, ఎస్సైలు పార్ధసారథి, జగన్మోహనరావు, అశోక్, బాలాజీ, సుధాకర్, స్వామినాయుడు ఆధ్వర్యంలో భారీ బందోబబస్తు ఏర్పాటుచేశారు.

చిత్రం..సజీవదహనమైన అన్నదమ్ములు నూకరాజు, ప్రసాద్