క్రైమ్/లీగల్

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైల్వేకోడూరు, సెప్టెంబర్ 6: కడప జిల్లా రైల్వేకోడూరు మండలం ప్రధాన రహదారిపై బుధవారం అర్ధరాత్రి ముందు, గురువారం తెల్లవారు జామున జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లు సీఐ సాయినాథ్ గురువారం విలేఖరులకు వివరించారు. వారి కథనం మేరకు వివరాలిలావున్నాయి. ఓబులవారిపల్లె మండలం మంగంపేటకు చెందిన ఎం.వంశీకృష్ణ (20), ఎన్.శ్రీకాంత్ (22) అనే యువకులు బుధవారం రాత్రి 11 సమయంలో రైల్వేకోడూరు నుంచి మంగంపేటకు మోటార్ బైక్‌పై వెళ్తుండగా ఆగి ఉన్న సిమెంటు లారీని అతివేగంగా వెనుక భాగంలో ఢీ కొనడంతో వారిద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ సంఘటనలో మోటార్‌బైక్ నుజ్జునుజ్జైంది. ఆగి ఉన్న లారీకి వెనుక వైపు ఎలాంటి లైట్లు లేక పోవడం వల్ల రాత్రి సమయంలో ఆగి ఉన్న లారీ కనిపించక పోవడంతో బైక్‌పై వెళ్తున్న వారు లారీ వెనుక ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని సీఐ చెప్పారు. అలాగే ఓబులవారిపలెల మండలం బాలిరెడ్డిపల్లెకు చెందిన హరికుమార్ (32) అనే వ్యక్తి గురువారం తెల్లవారు జామున పట్టణ శివారులోని ఒక పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు దాటుతుండగా అతివేగంగా బొప్పాయి లారీ ఢీ కొనడంతో ఆ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందినట్లు సీఐ పేర్కొన్నారు. కేవలం మూడు గంటలలోపు ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరిగి ముగ్గురు మృతి చెందిన కారణంగా స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఎస్సైలు వెంకటేశ్వర్లు, భక్తవత్సలం సిబ్బంది సహకారంతో జరిగిన ప్రమాదాలలో మృతులు ముగ్గురిని పోస్టుమార్టమ్ నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. మరోవైపు మంగంపేట, బాలిరెడ్డిపల్లెలలో విషాదఛాయలు అలుంకున్నాయి. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.