క్రైమ్/లీగల్

అతని క్షమాభిక్ష దరఖాస్తును పరిశీలించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషి పెరారివళన్ క్షమాభిక్ష దరఖాస్తును పరిశీలించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. జస్టిస్‌లు రంజన్ గొగొయ్, నవీన్ సిన్హా, కెఎం జోసఫ్‌లతో కూడిన ధర్మాసనం నిందితుడి ఇదివరకే తమిళనాడు ప్రభుత్వానికి చేసిన క్షమాభిక్ష అంశాన్ని పరిశీలించాలని పేర్కొంది. భారత మాజీప్రధాని రాజీవ్‌గాంధీని 1991లో హత్య చేసిన కేసుకు సంబంధించి ఏడుగురికి మరణశిక్ష పడింది. అయితే నిందితులు ఇప్పటికే దశాబ్దాలుగా శిక్ష అనుభవిస్తున్నందున వారిని విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దానిపై కేంద్రం అనుమతి తీసుకోవాలని సుప్రీం సూచించింది. భయంకరమైన కుట్రలో పాలుపంచుకుని ఒక దేశ ప్రధానిగా చేసిన వ్యక్తిని హత్య చేసిన ఇటువంటి వారిని విడుదల చేస్తే అంతర్జాతీయ సమాజానికి ప్రమాదకరమైన సంకేతాలు వెళతాయని, ఇది ఉగ్రవాదానికి ఊతం ఇచ్చినట్టు అవుతుందని, కాబట్టి నిందితులను విడిచిపెట్టడానికి తాము సమ్మతించడం లేదంటూ కేంద్రం ఆగస్టు 10న సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇలావుండగా నిందితుల్లో ఒకరైన పెరారివళన్ అలియాస్ అరివ్ (47) ఆగస్టు 20న సుప్రీంలో ఒక పిటిషన్ దాఖలు చేశారు. రాజీవ్‌హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే తాను 24ఏళ్లుగా శిక్షను అనుభవిస్తున్నానని, ఇది జీవితకాల శిక్ష అయిన 20 ఏళ్ల కంటే ఎక్కువని, తనకు క్షమాభిక్ష ఇవ్వాలని 2015 డిసెంబర్ 30న తమిళనాడు గవర్నర్‌కు దరఖాస్తు చేశానని, ఇప్పటివరకు ఆ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని పేర్కొన్నాడు.
ఇప్పటికే జీవితకాలపు శిక్షాకాలం కంటే ఎక్కువ సంవత్సరాలు ఖైదీగా ఉన్నానని, కేసుకు సంబంధించి ఆర్‌డిఎక్స్‌ను తయారు చేసిన ముద్దాయిలను ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయలేదని, విచారణ సైతం పూర్తి కాలేదని కోర్టుకు విన్నవించాడు. దీనిపై స్పందించిన ధర్మాసనం అతని క్షమాభిక్ష దరఖాస్తును పరిశీలించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.