క్రైమ్/లీగల్

బస్సు ఆటో డీ ఐదుగురి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, సెప్టెంబర్ 7: మండలంలోని యండపల్లివలస సమీపాన శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ఏరియా ఆసుపత్రిలో ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మైదాన ప్రాంతానికి తరలించారు. అరకులోయ నుంచి అరకు సంత వరకు వెళుతున్న ఆర్.టి.సి. బస్సు అరకు నుంచి అరకులోయ వైపు వస్తున్న ఆటో యండపల్లివలస వద్ద ప్రమాదవశాత్తు డీ కొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు గాయాలకు గురయ్యారు. గాయపడిన వారిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తుండగా ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మైదాన ప్రాంతానికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.