క్రైమ్/లీగల్

కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న స్కూల్ వ్యాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బి.కొత్తకోట, సెప్టెంబర్ 7: మండలంలోని గుమ్మసముద్రం వద్ద కరెంట్ స్తంభాన్ని స్కూల్ వ్యాన్ ఢీకొని ఆరుగురు పిల్లలకు గాయాలైన సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. వివరాలలోకి వెళ్తే బి.కొత్తకోట పట్టణంలోని శ్రీ్భగవాన్ సాయిరాం స్కూల్ విద్యార్థులు వ్యాన్‌లో 20మంది పిల్లలతో గట్టుకు బయలుదేరింది. మార్గం మధ్యలో గుమ్మసముద్రం గ్రామంలోని కొత్తపల్లె వద్ద రోడ్డు పక్కనే ఉన్న కరెంట్ స్తంభాన్ని స్కూల్ వ్యాన్ వేగంగా వెళ్లి ఢీకొంది. ఆ స్కూల్ వ్యానులో ఉన్న 20మంది విద్యార్థులు ఏమైనారో అని కూడా పట్టించుకోకుండా వ్యాన్ వదిలేసి డ్రైవర్ పరార్ అయ్యాడు. ఢీకొనడంతో కరెంట్‌స్తంభం కూడా విరిగి వ్యానుపై పడింది. కరెంట్ ప్రవహిస్తున్న వైర్లతో సహా విరిగి వ్యాన్‌పై పడడంతో ఎలాంటి ప్రమాదం స్తంబవించలేదు. లేదంటే స్కూల్ వ్యాన్, పిల్లలతో సహా బుగ్గి బూడిదయ్యేదని స్థానికులు తెలిపారు. ఆ తరువాత అటుగా వెళ్తున్న ప్రయాణికులు చాకచక్యంగా పిల్లలను వ్యానులో నుంచి కిందకి దించి 108కు సమాచారం అందించారు. బి.కొత్తకోట ప్రభుత్వ అసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. పిల్లలకు జరిగిన ప్రమాదం తెలుసుకొని తల్లిదండ్రులు, ప్రజలు అసుపత్రిలో గుమికూడారు. ఇంత మునుపు కూడా అనుమతి లేని స్కూల్ వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరిగి పిల్లలు చనిపోయిన సంఘటన జరిగింది. దీనిపై స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన తూతూ మంత్రంగా వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకొని వదిలేశారని స్థానికులు ఆరోపించారు. ఇకపైనా సంబంధిత అధికారులు అనుమతి లేని స్కూల్ వాహనాలపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు. వీరిలో గట్టు గ్రామానికి చెందిన ప్రీతా(5), నిహారిక(10), చంద్రశేఖర్(5), జ్ఞానాంభిక(11), దీక్షిత(5), లేఖన(4) గాయపడ్డారు.