క్రైమ్/లీగల్

పోలీసు రక్షణ కోరిన ప్రేమజంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదలకూరు, సెప్టెంబర్ 7: పెద్దలకు ఇష్టంలేని ప్రేమవివాహం చేసుకున్న ప్రేమజంట శుక్రవారం స్థానిక పోలీసులను ఆశ్రయించింది. కలువాయి మండలం కుళ్లూరుకు చెందిన నరసింహులు, అదే గ్రామానికి చెందిన స్వప్న గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ మేజర్లు కావడంతో నాలుగు రోజుల కిందట పెద్దలకు తెలియకుండా కడపకు వెళ్లి అక్కడ ఒక గుడిలో పెళ్లిచేసున్నారు. ఈ నేపథ్యంలో ఇరువైపుల పెద్దల నుండి బెదిరింపులు వస్తుండటంతో గురువారం జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఎస్పీ సూచనల మేరకు పొదలకూరు పోలీసు స్టేషన్‌కు వచ్చి ప్రేమవివాహం చేసుకున్న తమకు కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. సీఐ శివరామకృష్ణారెడ్డి ఇరువర్గాల పెద్దలను పిలిపించి వారికి సర్ధిచెప్పారు.