క్రైమ్/లీగల్

అటవీ ప్రాంతంలో వృద్ధురాలి మృతదేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదలకూరు, సెప్టెంబర్ 7: మండలంలోని ఇనుకుర్తి అటవీ ప్రాంతంలో శుక్రవారం గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహాన్ని కనుగొన్నారు. పశువుల కాపరులు మృతదేహాన్ని గమనించి గ్రామస్తుల దృష్టికి తీసుకువచ్చారు. మృతురాలి వయస్సు 75 సంవత్సరాలు ఉండవచ్చని భావిస్తున్నారు. ఎస్సై రవినాయక్ సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆక్రమణ భూములు ప్రభుత్వ స్వాధీనం
వింజమూరు, సెప్టెంబర్ 7: మండలంలోని రావిపాడు గ్రామంలో ప్రభుత్వ భూములు ఆక్రమించారని హైకోర్టులో వేసిన పిటీషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్యుల మేరకు వివిధ సర్వే నెంబర్లలోని మొత్తం 59 ఎకరాల భూమిని శుక్రవారం రెవెన్యూశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న భూమిలోని 10 ఎకరాలలో టేకు, జామ సాగు చేస్తున్నారని, మిగిలిన 49 ఎకరాలు బీడుగా ఉందన్నారు. స్వాధీనం చేసుకున్న భూమిలో ప్రభుత్వ భూమిగా హెచ్చరిక బోర్డును ఏర్పాటుచేసినట్లు ఆర్‌ఐ శైలజ, వీఆర్వో వెంగయ్య తెలిపారు.

పంది దాడిలో బాలుడికి తీవ్రగాయాలు
పొదలకూరు, సెప్టెంబర్ 7: పంది దాడిచేసి కరవడంతో బాలుడికి తీవ్రగాయాలైన సంఘటన పొదలకూరు పంచాయతీ బస్టాండులో శుక్రవారం రాత్రి జరిగింది. మరుపూరు గ్రామానికి చెందిన సోమశేఖర్ అనే బాలుడు తన తండ్రి మస్తానయ్యతో కలసి వ్యక్తిగత పనులపై పొదలకూరుకు వచ్చారు. పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు బస్టాండులో బస్సుకోసం ఎదురుచూస్తూ తినుబండారాలు తింటుండగా ఒక పంది బాలుడిపై దాడిచేసి తినుబండారాన్ని లాగే ప్రయత్నంలో తీవ్రంగా గాయపరచింది. ఈ దాడిలో బాలుడి మర్మాంగాల వద్ద గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి గాయపడిన బాలుడిని పట్టణంలోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.

కాశీతోట శివాలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు
వెంకటగిరి, సెప్టెంబర్ 7: పట్టణంలోని కాశీతోటలో ఉన్న శివాలయంలో గుర్తితెలియని వ్యక్తులు రెండురోజుల క్రితం గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. 300 సంవత్సరాల చరిత్ర కలిగిన రాజుల శివాలయంలో గుప్తనిధులు ఉంటాయని ఊహించిన దొంగలు ఆలయంలో ఉన్న శివలింగాన్ని సైతం తవ్వి పక్కన పడవేశారు. శివలింగం కింద సుమారు ఆరు అడుగుల లోతు తవ్వకాలు చేశారు. ఆలయం శివారు ప్రాంతంలో ఉండటం, రాత్రి పూట అక్కడ ఎవరూ ఉండరని గమనించిన దుండగులు ఆలయంలో ఈ తవ్వకాలు చేశారని తెలుస్తోంది. రాజుల కాలంలో ఆలయాలు నిర్మించేటప్పుడు బంగారు, వెండి ఆభరణాలు వేయడం ఆనవాయితీగా ఉండటం వల్ల దుండగులు ఈ ఆలయంలో నిధుల కోసం కొంత భాగాన్ని తవ్వకాలు చేపటినట్లు భావిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా శివలింగానే్న లోడి పక్కన పెట్టి తవ్వకాలు చేపట్టడం విశేషం. రాజుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేయడంతో ఆలయంలోని ఆలనా పాలనా సక్రమంగా లేకపోవడం గుర్తించిన బయటి వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు అక్కడున్న వారు తెలిపారు.