క్రైమ్/లీగల్

వాట్సప్ ద్వారా విచారణా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: సామాజిక మాధ్యమాల్లో విస్తృత వినియోగంలో ఉన్న వాట్సాప్ మెస్సేంజర్ సాయంతో ఒక క్రిమినల్ కేసు విచారణ జరుపుతారంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది నిజం. ఇలా విచారణ జరిపిన కేసు గురించి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇది ఏమైనా జోకా? అంటూ సుప్రీం సైతం కిందికోర్టు వైఖరిపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. జార్ఖండ్ మాజీ మంత్రి యోగేంద్రరావు, అయిన ఆయన సతీమణి నిర్మలాదేవి 2016లో అల్లర్ల కేసులో నిందితులు. అయితే గత ఏడాది వారికి బెయిల్ వచ్చిన సందర్భంగా ఉన్నత న్యాయస్థానం కొన్ని షరతులు విధించింది. వారు భోపాల్‌లోనే ఉండాలని, కోర్టు విచారణకు తప్ప జార్ఖండ్‌కు వెళ్లరాదని పేర్కొంది. అయితే ఏప్రిల్ 19న హజారిబాగ్‌కు చెందిన దిగువ కోర్టు జడ్జి వారిని వాట్సాప్ ద్వారా విచారణ జరిపారు. ట్రయల్ కోర్టు జడ్జి తాము అభ్యంతరం చెబుతున్నా వినకుండా వాట్సాప్ ద్వారా తమను విచారించారని యోగేంద్రరావు దంపతులు సుప్రీం కోర్టుకు విన్నవించారు. దీనిని విచారించిన జస్టిస్‌లు ఎస్‌ఎ బోబ్డె, ఎల్‌ఎన్ రావు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘అసలు జార్ఖండ్‌లో ఏం జరుగుతోంది? ఇలాంటి విధానాన్ని అంగీకరించం. అసలు వాట్సాప్ ద్వారా విచారణ జరపడం ఏమిటి? ఇదేమన్నా జోకా?, ఇదే విధమైన విచారణ?’ అంటూ జార్ఖండ్ తరఫున హాజరైన ప్రతినిధిని ప్రశ్నించింది. దీనిపై రెడు వారాల్లోగా తమ స్పందన తెలియజేయాలని జార్ఖండ్ ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. నిందితులు బెయిల్ నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ కాలం భోపాల్ అవతలే గుడపుతున్నందున ఇలా చేయాల్సి వచ్చిందని జార్ఖండ్ తరఫున న్యాయవాది తెలియజేయగా, అది వేరే విషయమని, వారు కనుక అలా చేసి ఉంటే తమ దృష్టికి తెలియజేయవచ్చునని పేర్కొంది.