క్రైమ్/లీగల్

తృటిలో తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెరకముడిదాం, సెప్టెంబర్ 10: మండలంలో గల గర్భాం-గొట్టిపల్లి రోడ్డుకు ఆనుకుని ఉన్న పంచముఖి ఆంజనేయ కాలని వద్ద సోమవారం తృటిలో భారీ ప్రమాదం తప్పటంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. గర్భాంలో గల విశాఖ స్టీల్ ప్లాంట్ మైన్ నుండి సుమారు 21 టన్నుల మాంగనీస్ ఓరుతో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు బారీ లారీ బయలుదేరి వెళుతుంది. ఇటీవల ఈ రోడ్డుకు ఇరువైపుల డ్రైనేజ్ కాలువలు నిర్మించారు. కాలువ గోడల ప్రక్కన కొత్తగా మట్టి వేసారు. ఈ విషయాన్ని గమనించని వాహన చోదకుడు కాలువకు అతి సమీపంలో వాహనాన్ని నడిపాడు. దీంతో కాలువ గోడ విరిగి రారీ లోతుగా ఉన్న కాలువలోకి జారి ప్రక్కకు వాలిపోయింది. ఈ లారీ వాలిన ప్రక్కనే 136 కిలో వాల్ట్స్ హెవీ విద్యుత్ లైన్ వెళుతుంది. ఈ క్రమంలో కాలువలోకి జారిన లారీ విద్యుత్ స్థంభాలకు డీకొని ఉంటే ఎందరో విద్యుత్ వాతకు గురయ్యేవారని తృటిలో భారీ ప్రమాదం తప్పిందని కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.