క్రైమ్/లీగల్

విద్యుదాఘతానికి రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినేపల్లి, సెప్టెంబర్ 14: మండల కేంద్రానికి చెందిన చీర్ణం కొండయ్య(57) విద్యుదాఘాతానికి గురై గురువారం రాత్రి పొలం వద్ద మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బత్తుల రాములు అనే రైతు అడవి పందుల బెడద కోసం పొలం చుట్టు విద్యుత్ వైర్లతో కంచె ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గురువారం రాత్రి పొలంలో నీళ్లు పెట్టడానికి వెళ్లిన చీర్ణం కొండయ్య పొలం గట్టుపై విద్యుత్ వైర్లను గమనించక ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య నాగమ్మ, ఇద్దరు కుమారు, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలిపారు. మృతుని భార్య నాగమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృత దేహాన్ని నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.