క్రైమ్/లీగల్

అనారోగ్యంతోనే చనిపోయింది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, సెప్టెంబర్ 14: భుక్యారాంతండాలో బుధవారం పసిబిడ్డ చనిపోయిన ఘటనపై గురువారం మహబూబాబాద్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డీఐఓ) అంబరీష్, డాక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో వైద్యాధికారుల బృందం తండాకు వచ్చి విచారణ జరిపారు. అలాగే ఇనుగుర్తి పీహెచ్‌సీకి వెళ్లి టీకా బ్యాచ్ నెంబర్ ఇతర వివరాలు తెలుసుకున్నారు. ఒకే బ్యాచ్ నెంబర్ గల టీకా బుడ్డీలోంచి నలుగురు పిల్లలకు టీకాలు ఇచ్చార ని, అందులో ఏవరికి ఎలాంటి ఇబ్బం ది లేకపోవడం, ఈ బిడ్డ మాత్రమే మృత్యువాత పడటంతో టీకా కార ణం కాదని నిర్ధారించినట్లు డీఐఓ తెలిపారు. అలాగే మృతిచెందిన బిడ్డ తల్లిదండ్రులకు తొలుత ఒక కాన్పులో మగబిడ్డ పుట్టి పురిట్లోనే మృతి చెందాడని, తరువాత కాన్పులో పుట్టిన ఆడబిడ్డ అనారోగ్యంతో ఉందని, ఇప్పు డు మూడో సంతానంగా జన్మించిన ఆడబిడ్డ ఆరోగ్యంగా లేక పోవడంతో సైతం తొమ్మిది రోజుల పాటు ఐసీయులోనే ఉందన్నారు. ఆ క్రమంలో పుట్టినపుడే వేయాల్సిన టీకాలు వేయలేదన్నారు. తరువాత నెలన్నరకు వేశారని, బిడ్డ ఆరోగ్య పరిస్థితి సరిగాలేకపోవడం ఒక కారణమని, అలాగే నోటి, ముక్కు నుండి నురగలు వచ్చాయని చెబుతుండటంతో తల్లి పాలు రిగా పట్టకపోవడంతో ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం అయినా జరిగి ఉంటుందని, ఒక వేళ బిడ్డకు ఫిట్స్ వచ్చినా మరణించడం జరుగుతుందన్నారు. తండావాసులతో పాటు తల్లితండ్రులతో మాట్లాడి ఏమైనా సందేహాలుంటే పసిబిడ్డ మరణంపై సమగ్ర విచారణ జరిపించేందుకు సిద్ధమని, పోలీస్ కంప్లైంట్ చేస్తే పోస్టుమార్టం నిర్వహించి మరణానికి అసలు కారణం తెలుస్తుందని చెప్పామని, అయితే వారు అందుకు అంగీకరించలేదన్నారు.