క్రైమ్/లీగల్

వేర్వేరు సంఘటనల్లో 11మంది అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీపురుపల్లి, సెప్టెంబర్ 14: చీపురుపల్లి మండలంలో పోలీసులు చేపట్టిన ఆకస్మిక దాడుల్లో వేర్వేరు సంఘటనల్లో 11 మందిని అరెస్టు చేసినట్టు ఎస్సై దుర్గాప్రసాద్ శుక్రవారం విలేఖరులకు తెలిపారు. చీపురుపల్లి పట్టణంలోని పాతబస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద 199 మద్యం సీసాలను తరలిస్తుండగా వెంపడాపు శ్రీనివాసరావు, చెల్లూరు సూర్యనారాయణలతో పాటు మరో ఇద్దరిపై అక్రమ మద్యం విక్రయాలు జరుపుతున్న నేరానికి కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. మద్యం బాటిల్స్‌ను అబ్కారీశాఖాధికారులకు అప్పగించినట్టు ఆయన వివరించారు. అలాగే మండలంలోని సంకుపాలెంలో అక్రమంగా ఖైనీ, గుట్కాలు విక్రయిస్తున్నట్టు సమాచారం రావడంతో వారణాసి శ్రీనివాసరావుకి చెందిన దుకాణంలో దాడులు నిర్వహించి సుమారు రూ.600 ఖరీదు చేసే ఖైనీ, గుట్కాలను స్వాధీనం చేసుకుని విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశామని తెలిపారు. అలాగే రామలింగాపురం పంచాయతీ పరిధిలోని పుర్రేయవలస గ్రామంలో పేకాట ఆడుతున్న శిబిరంపై దాడులు నిర్వహించి సుమారు రూ.39వేలు స్వాధీనం చేసుకోగా ఆరుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని చెప్పారు.