క్రైమ్/లీగల్

రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వజ్రకరూరు, సెప్టెంబర్ 14 : అప్పుల బాధ తాళలేక మండల పరిధిలోని తట్రకల్లు గ్రామంలో రైతు కురుబ సుంకన్న(55) శుక్రవారం పప్పశెనగ మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుంకన్న విష గుళికలు తిన్నాడు. గమణించిన కుటుంబ సభ్యులు ఆటోలో గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సుంకన్న నాలుగెకరాల పొలాన్ని సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు చేతికందపోవడంతో పొలంలో ఆరు బోర్లు వేయించాడు. దీంతో చేసిన సుమారు రూ.8 లక్షలు అప్పులు చేశాడు. దీంతో పాటు కుమార్తెల వివాహానికి మరికొన్ని అప్పులు చేశాడు. వీటికితోడు భార్యకు కొంతకాలంగా కాళ్లు, చేతులు పడిపోయి అనారోగ్య సమస్యలు పెరిగిపోయాయి. ఈనేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వజ్రకరూరు పోలీసులు తెలిపారు.