క్రైమ్/లీగల్

ముఖ్యమంత్రి బందోబస్తు విధుల్లో ఎస్‌ఐ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, సెప్టెంబర్ 14: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సారెను అందించేందుకు తిరుపతికి వచ్చారు. శుక్రవారం ఆయన తిరుగు ప్రయాణంలో విమానాశ్రయంలో బందోబస్తు డ్యూటీ చేస్తున్న ఏర్పేడు ఎస్‌ఐ వెంకటరమణ (37) విధుల్లో ఒక్కసారిగా గుండెపోటురావడంతో కుప్పకూలి పడిపోయాడు. అక్కడే ఉన్న అధికారులు, పోలీసులు అత్యవసర చికిత్స నిమిత్తం నారాయణాద్రి హాస్పిటల్‌కు తరలించి ప్రాథమిక చికిత్స చేస్తుండగా గుండెపోటుతో మృతిచెందారు. ఎస్‌ఐ వెంకటరమణ 2002 బ్యాచ్‌లో ఆర్‌ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించి పెద్దమండ్యంలో విధులు నిర్వహించారు. 2007 నుంచి సివిల్ ఎస్‌ఐగా కేవీబీపురం, శ్రీకాళహస్తి, 2017 ఏప్రిల్ 21వ తేదీన ఏర్పేడు ఘటనకు సంబంధించి అంతకుముందున్న అధికారులు సస్పెండ్ కాగా, ఏప్రిల్ 22న తిరుమల నుండి ఏర్పేడు ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం వీరబల్లి మండలం మట్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తొగటపల్లి గ్రామానికి చెందిన రామయ్య, వెంకటసుబ్బమ్మ దంపతుల పెద్దకుమారుడు. ఈయనకు భార్య మహేశ్వరి (35) కుమార్తె దివ్యశ్రీ (6), రెండో కుమారుడు సాయితేజ (4), మూడవ కుమారుడు మోహన్‌కృష్ణ (18నెలలు) ఉన్నారు. ఈయన మృతితో కుటుంబం పెద్దదిక్కును కోల్పోయిందని, చెట్టంత కొడుకున్న కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు మిన్నమంటాయి. ముఖ్యమంత్రి వీడ్కోలు అనంతరం విషయం తెలుసుకున్న మంత్రి అమరనాథరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, కర్నూల్ డీఐజీ శ్రీనివాస్, తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి, నారాయణాద్రి హాస్పిటల్‌కు చేరుకొని విధుల్లో మృతిచెందిన ఎస్‌ఐకు సంతాపం తెలిపి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి అమరనాథ్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ చిన్నవయస్సులో ప్రభుత్వవిధుల్లో ఎస్‌ఐ వెంకటరమణ మృతిచెందడం బాధాకరమని, ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని, ప్రభుత్వం తరపున రూ.10లక్షలు ఆయన కుటుంబానికి అందజేస్తామని తెలిపారు. వారి కుటుంబంలో చదువుకున్న వారుంటే ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చర్యలు చేపడతామన్నారు.