క్రైమ్/లీగల్

ఆటోకింద పడి బాలుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, సెప్టెంబర్ 15: నివాసగృహాలకు తాగునీటిని సరఫరా చేసే ఆటోకిందపడి ఓ బాలుడు మృతిచెందిన సంఘటన శనివారం పట్టణంలోని బాపూజీకాలనీలో చోటుచేసుకుంది. పట్టణ ఎస్సై జి కోటయ్య కధనం ప్రకారం తాగునీటిని సరఫరా చేసి వస్తున్న ఆటోను యాకోబు (7) పరిగెత్తుకుంటూ వచ్చి ఢీకొన్నాడు. ఈప్రమాదంలో గాయపడిన యాకోబును మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఈమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కోటయ్య తెలిపారు.
రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి
గిద్దలూరు, సెప్టెంబర్ 15: రోడ్డుప్రమాదంలో మండలంలోని ముండ్లపాడు గ్రామానికి చెందిన యువకుడు మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. ముండ్లపాడు గ్రామానికి చెందిన కె పవన్‌కల్యాణ్ (20) శుక్రవారం రాత్రి 11గంటల సమయంలో ముండ్లపాడు నుంచి గిద్దలూరుకు వచ్చి మోటారుసైకిల్‌పై తిరిగి స్వగ్రామం వెళ్తుండగా రైస్‌మిల్ సమీపంలో మోటారుసైకిల్ అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకువెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. రైస్‌మిల్లు యాజమాన్యం ఇచ్చిన సమాచారం మేరకు పవన్‌కల్యాణ్ బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తీసుకువెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ పవన్‌కల్యాణ్ మృతిచెందాడు. నంద్యాలలో పోస్టుమార్టం అనంతరం పవన్‌కల్యాణ్ మృతదేహాన్ని ముండ్లపాడుకు తరలించారు.

రోడ్డు ప్రమాదంలో హోంగార్డుకు గాయాలు
రాచర్ల, సెప్టెంబర్15: రోడ్డు ప్రమాదంలో హోంగార్డు గాయపడిన సంఘటన శనివారం సాయంత్రం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. విధులు నిర్వహించేందుకు సయ్యద్ ఖాజావలి మోటార్‌సైకిల్‌పై రామన్న కతువ వెళ్తుండగా పలుగుంటిపల్లి మలుపువద్ద లారీ మోటార్‌బైక్‌ను ఢీకొంది. ఈసంఘటనలో ఖాజావలి చెయ్యి విరిగింది. స్థానికులు 108కు సమాచారం అందించడంతో గిద్దలూరు వైద్యశాలకు తరిలించారు.

చౌక దుకాణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడులు
తర్లుపాడు, సెప్టెంబర్ 15: మండలంలోని లక్ష్మక్కపల్లి గ్రామంలోగల చౌకదుకాణంపై శనివారం ఎన్స్‌ఫోర్సుమెంటు అధికారులు దాడులు నిర్వహించి రేషన్ నిల్వలను పరిశీలించారు. ఈ-పాసు యంత్రంలో పేర్కొన్నట్లు 30క్వింటాళ్ళ బియ్యం, 25కిలోల పంచదార, 50 కిలోల కందిపప్పు చౌకదుకాణంలో నిల్వ ఉండాల్సి ఉండగా నిల్వలు కానరాకపోవడంతో డీలర్‌పై అధికారులు కేసు నమోదు చేశారు. ఈదాడుల్లో ఎన్‌ఫోర్సుమెంటు అధికారులు శివరాజు లక్ష్మీనారాయణ, ఎఆర్‌ఐ సాలమ్మ తదితరులు పాల్గొన్నారు.