క్రైమ్/లీగల్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో కోటికిపైగా దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ: నెల్లూరు జిల్లా తడ మండల కేంద్రంలో శ్రీకాళహస్తి రోడ్డు సమీపంలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో కోటిపైగా దోపిడీ జరిగినట్లు బ్యాంకు మేనేజర్ వరుణ్‌కుమార్ సోమవారం తడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందిన ఫిర్యాదు మేరకు గూడూరు డీఎస్పీ రాంబాబు విచారణను వేగవంతం చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం రాత్రి హెచ్‌డీఎఫ్‌సీ డిప్యూటీ మేనేజర్ పవన్‌కుమార్ మరో ఇద్దరితో కలిసి కారులో బ్యాంకు వద్దకు చేరుకుని సెక్యూరిటీ గార్డు తలుపులు తీయగా బ్యాంకులోకి వెళ్లారు. దాదాపుగా గంట వరకు బ్యాంకులో ఉండి అనంతరం బ్యాంకు నుంచి రెండు బ్యాగులను తీసుకుని కారులో వెళ్లిపోయారు. ఈ విషయాలను తర్వాత బ్యాంకు మేనేజర్ వరుణ్‌కుమార్‌కు సెక్యూరిటీ గార్డు సమాచారం అందించారు. దీంతో వరుణ్ సోమవారం ఉదయం బ్యాంకును పరిశీలించి దోపిడీ జరిగినట్లు తడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అందులో భాగంగానే తడ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును డీఎస్పీ రాంబాబు, తడ ఎస్సై వెంకటేశ్వర్లు క్షణ్ణంగా పరిశీలించారు. డిప్యూటీ మేనేజర్ పవన్‌కుమార్ ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఎందుకంటే రెండు రోజుల క్రితం తడలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో సీసీ కెమెరాలు చెడిపోవడంతో డిప్యూటీ మేనేజర్ ఓ పథకం ప్రకారం ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే బ్యాంకు మేనేజర్ వరుణ్‌కుమార్ ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అంతే కాకుండా చెన్నై నుండి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నతాధికారులను పిలిపించి పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. బ్యాంకులో దాదాపుగా కోటి రూపాయలకు పైగా నగదుతోపాటు బంగారు నగలు కూడా దోపిడీకి గురైవుంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆదిశగా విచారణను వేగవంతం చేశారు. డిప్యూటీ మేనేజర్‌ను అదుపులోకి తీసుకోవడానికి తమ వంతు ప్రయత్నాలను పోలీసులు మొదలుపెట్టారు.