క్రైమ్/లీగల్

ఆత్మహత్యా యత్నం చేసిన ఓదేలు అనుచరుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, సెప్టెంబర్ 18: మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ టిక్కెట్‌ను తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు ఇవ్వలేదని మనస్తాపంతో ఈనెల 12న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసిన రేగుంట గట్టయ్య (35) మృతి చెందాడు. వివరాలోకి వెళ్తే.. టీఆర్‌ఎస్ ప్రచార ర్యాలీలో ఇందారం గ్రామంలోని అభివృద్ధి పనులకు ఎంపీ బాల్క సుమన్ ప్రారంభోత్సవాలు చేస్తుండగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన గట్టయ్య 80 శాతం కాలిపోగా మృత్యువుతో పోరాడి హైదరాబాద్‌లోని మలక్‌పేట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్నాహ్నం 2:20 నిమిషాలకు మృతి చెందాడు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు టికెట్ ఇవ్వకుండా పెద్ద పల్లి పార్లమెంట్ సభ్యులు బాల్క సుమన్‌ను చెన్నూర్ అభ్యర్థిగా ప్రకటించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఓదెలుకు టికెట్ ఇవ్వకపోవడంపై రేగుంట గట్టయ్య మనస్థాపం చెందాడు. మొదటి నుంచి పార్టీలో పని చేస్తున్న గట్టయ్య జైపూర్ మండలం ఇందారం గ్రామస్థుడు. ఇతను తెలంగాణ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షునిగా ఇందారంలోని 13వ వార్డు సభ్యునిగా పనిచేశారు. గట్టయ్యకు ఓదేలు కుటుంబం దగ్గరయ్యారు. గట్టయ్య అనారోగ్య పరిస్థితుల్లో ఓదెలు ఆయనను ఆదుకోవడంతో ఓదెలుపై గట్టయ్యకు అభిమానం పెరిగింది. ఈ క్రమంలో అభ్యర్థి బాల్క సుమన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తుండగా గట్టయ్య తన వెంట తీసుకొచ్చుకున్న పెట్రోల్ సీసాను ఒంటిపై పోసుకోగా మహిళల చేతిలోని మంగళహారతులపై పెట్రోల్ పడి పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగాయి. 12 మంది ప్రజా ప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులతో పాటు ముగ్గురు మీడియా రిపోర్టర్లకు గాయాలు అయ్యాయి. గట్టయ్యకు 80 శాతం గాయాలయ్యాయ.