క్రైమ్/లీగల్

పర్యావరణ సంఘాల సభ్యులకు నీలగిరి అడవుల్లో నో ఎంట్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 19: నీలగిరి జిల్లాలోని అభయారణ్యం, రిజర్వు అటవీ భూముల్లోకి నీలగిరి వన్యప్రాణి, పర్యావరణ సంఘం సభ్యులు తదుపరి ఆదేశాలు వెలువడేంతవరకు ప్రవేశించరాదని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ శాఖాధికారులు అడవుల సంరక్షణ దృష్ట్యా విధి నిర్వహణలో భాగంగా ప్రవేశించే హక్కు ఉంటుందని న్యాయమూర్తి జస్టిస్ ఎన్ కిరుబకారన్ పేర్కొన్నారు.
రిజర్వు అటవీ భూములు, అక్కడ ఉన్న వన్యప్రాణులను సంరక్షించాలనే ఉద్దేశ్యంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు హైకోర్టు పేర్కొంది. అడవుల సంరక్షణతోనే అధికారులు తప్ప ఇతరులెవరూ, చివరకు పర్యావరణ సంఘం సభ్యులైనా ప్రవేశించకుండా ఆదేశాలు జారీ చేసినట్లుహైకోర్టు పేర్కొంది. అడవుల సంరక్షణ దృష్ట్యా ఏర్పాటైన పర్యావరణ సంఘంలో చేరినకొత్త సభ్యుల వివరాలను తెలుసుకోవాలని కోరుతూ ఎల్ సీతారామన్ అనే పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించి పై ఆదేశాలనుజారీ చేసింది. పర్యావరణ సంఘాల్లో కొంత మంది నేరగాళ్లు చేరారని, వీరిని సంఘం నుంచి తొలగించే విధంగా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అనంతరం ఈ కేసు విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేశారు.