క్రైమ్/లీగల్

ప్రేమపెళ్లి విషాదాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్, సెప్టెంబర్ 20: కులం మరో ప్రేమ జంటను కాటు వేసింది. యువకుడు దళితుడు కావటం, యువతి తండ్రి పోలీసు కావటం ఈ సారి శాపమైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను తన నుంచి దూరం చేశారన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘంటన పాతబస్తీలో చోటుచేసుకుంది. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సంతోష్‌గనర్ పీఎస్ పరిధిలోని రక్షాపురంకాలనీకి చెందిన చిట్టిపాక శ్రీకాంత్ అనే యువకుడు నాలుగు సంవత్సరాల క్రితం ఓ అమ్మాయినీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులు బంధువులతో కలిసి అతన్ని బెదిరించి బలవంతంగా భార్యను శ్రీకాంత్ నుండి తీసుకెళ్లిపోయారు. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఎంతో ప్రేమతో మెలిగిన ఇరువురు జీవనం కోనసాగించిన ఆ దంపతులు విడిపోవటాన్ని తట్టుకోలేక, మనోధైర్యం కొల్పోయిన శ్రీకాంత్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంటల్లో కాలి, తీవ్రంగా గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అమ్మాయి తండ్రి పోలీస్ శాఖలో పనిచేస్తుండటంతో శ్రీకాంత్ కుటుంబ సభ్యులపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నాడని, దళితుడు కావడంతోనే అతడు కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడ్డాడని శ్రీకాంత్ బందువులు ఆరోపించారు.

శ్రీకాంత్ పెళ్లినాటి ఫొటో..