క్రైమ్/లీగల్
కోడూరు బీచ్‌లో యువతి ఆత్మహత్యాయత్నం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 21 September 2018
తోటపల్లిగూడూరు, సెప్టెంబర్ 21: బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన గంటా అనిత అనే యువతి శుక్రవారం తోటపల్లిగూడూరు మండలంలోని కోడూరు బీచ్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. గంటా అనిత శుక్రవారం కోడూరు బీచ్‌కు ఒంటరిగా వచ్చి అనుమానాస్పదంగా సంచరిస్తూ సముద్రంలో మునిగి లోతుకుపోవడంతో ఈమె చర్యలను గమనించిన పోలీసులు పసిగట్టి ఆమెను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆత్మహత్యాయత్నానికి దారితీసిన కారణాలు తెలియరావడం లేదు. పోలీసులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం తెలిపి ఆమెను సురక్షితంగా అప్పగించారు. యువతి ఆత్మహత్యాయత్నాన్ని నివారించి కాపాడిన ఎఎస్‌ఐ వారి సిబ్బందిని ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి అభినందించారు.