క్రైమ్/లీగల్

కుందూనదిలో దూకిన మహిళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాపాడు, సెప్టెంబర్ 24: మండలంలోని సీతారామపురం గ్రామంవద్ద సోమవారం పాత బ్రిడ్జీపై నుంచి కుందూనదిలోకి రత్న అనే మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి దూకిందని ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు మండలం ఖాదరబాద్ గ్రామానికి చెందిన కావుగాల్ల రత్న కుటుంబ మనస్పర్థలతో చాపాడు మండలం సీతారామపురం గ్రామానికి చేరుకుని ఆ నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి ప్రయత్నించింది. అంతలో ఆమె నది మధ్యలో ఉన్న ఓ చెట్టును పట్టుకొని వేళాడుతుండగా ఆక్కడ సంచరిస్తున్న స్థానికులు పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు గజ ఈతగాళ్లతో ప్రయత్నించి నది నుంచి ఆమెను బయటికి తీసుకురావడం జరిగిందన్నారు. నీళ్లు తాగి ఆమె అపస్మారక స్థితిలో ఉండటంతో చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

హత్యాయత్నం కేసులో ముగ్గురికి 10 ఏళ్లు జైలు
ముద్దనూరు, సెప్టెంబర్ 24: మండల పరిధిలోని నొస్సంవారిపల్లె గ్రామంలో 2010 జరిగిన భూమి విషయం తగాదాలలో ముగ్గురికి 10 ఏళ్లు శిక్ష, ఒక్కొక్కరికి రూ.2000 జరిమానా విధించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఈ కేసుపై సీఐ చిన్నపెద్దయ్య మాట్లాడుతూ 2010 సంవత్సరములో నొస్సంవారిపల్లె గ్రామ పరిధిలోని స్థల వివాదంలో టి.రాముడు, వెంకటరమణ, రాజు అనే ముద్దాయిలు అదే గ్రామానికి చెందిన సోమిరెడ్డి, అతని తనయునిపై ఇనుప రాడ్లతో, రాళ్లతో దాడిచేసి తీవ్రగాయాలు కావడంతో అప్పటి ఫిర్యాదుదారుల ఫిర్యాదు మేరకు హత్యాప్రయత్నం కేసును అప్పటి ఎస్‌ఐ సదాశివయ్య వీరిపై కేసును నమోదు చేయడం జరిగింది. సోమవారం ప్రొద్దుటూరు ఏఎస్‌జె కోర్టులో వీరి ముగ్గరికి జడ్జి పాండురంగారెడ్డి 10 ఏళ్లు జైలు, ఒక్కొక్కరికి రూ.2000 జరిమానా విధించడం జరిగిందన్నారు. సకాలంలో సాక్షులను ప్రవేశపెట్టి రామాంజనేయులును పబ్లిక్ ప్రాసిక్యూటర్ చౌరెడ్డి అభినందించారన్నారు. ముద్దాయిలు ముగ్గురిని కడప సబ్ జైలుకు హాజరుపరిచినట్లు పేర్కొన్నారు.