క్రైమ్/లీగల్

నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 3: నల్లగొండ జిల్లా కేంద్రంలో శనివారం తెల్లవారుజామున నార్కట్‌పల్లి- అద్దంకి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొట్టకూటి కోసం రాష్ట్రాలు, జిల్లాలు దాటి రాజధానిలో ఒక సంస్థలో పని చేస్తూ వారు చెప్పిన చోటుకు పనికి వెళ్లి మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. నల్లగొండ రూరల్ ఎస్‌ఐ రాములు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం నల్లగొండలో జరిగే మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభకు సంబంధించిన ఏర్పాట్లు, క్యాటరింగ్‌కు హైద్రాబాద్‌కు చెందిన కేఎంకే కృష్ణ ఈవెంట్స్ మేనేజ్‌మెంట్‌కు చెందిన నలుగురు కార్మికులు నల్లగొండకు బస్సులో వస్తూ శనివారం తెల్లవారుజామున అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై దిగారు. అయితే వీరు రహదారిపై నల్లగొండ- మర్రిగూడ బైపాస్ వద్ద బస్సు దిగాల్సి ఉండగా పొరపాటుగా పానగల్ ఇందిరా గాంధీ చౌరస్తా వద్ద దిగారు. ఉదయం కావడంతో పొరపాటుగా దిగి నడుచుకుంటూ మర్రిగూడ బైపాస్ వద్దకు వెళ్తున్నారు. ఈ క్రమంలో మిర్యాలగూడ నుండి హైద్రాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం అతి వేగంతో వస్తూ నలుగురిలో ముగ్గురిని ఢీకొట్టడంతో ముగ్గురూఎగిరి పక్కనే ఉన్న ముళ్లపొదల్లో పడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే డీసీఎం డ్రైవర్ తన వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో ముగ్గురు యువకులు కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర గుండ్లపల్లి గ్రామం బీసీ కాలనీకి చెందిన వాసిరెడ్డి మురళి(31), విశాఖ పట్నానికి చెందిన కొడాలి హేమంత్(32), నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం అక్కంగారిపేట భీమవరంనకు చెందిన దామెర సుమన్(26) అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి నెల్లూరు జిల్లా చెన్నూరుకు చెందిన జక్కలి శంకరయ్య మాత్రం అదృష్టవశాత్తు డీసీఎం బారిన పడకుండా తప్పించుకున్నాడు.
ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న నల్లగొండ డీఎస్పీ సుధాకర్ తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద తీరుతెన్నులను జక్కలి శంకరయ్య, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాలను మార్చురీకి తరలించి పోస్టుమార్టమ్ తదుపరి కుటుంబీలకు అప్పగించారు. పరారీలో ఉన్న డీసీఎం డ్రైవర్‌ను పట్టుకునేందుకు మూడు బృందాలుగా పోలీసులు వెళ్లినట్టు ఎస్‌ఐ రాములు తెలిపారు.

చిత్రం..ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడు