క్రైమ్/లీగల్

కాలువలో పడి రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదలకూరు, సెప్టెంబర్ 28 : పశువులను మేతకు తీసుకెళ్లిన ఈశ్వరయ్య (52) అనే రైతు కాలువలో పడి మృతిచెందిన ఉదంతం మండలంలోని నేదురుపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈశ్వరయ్య గురువారం పశువులను మేపేందుకు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి తోలుకెళ్లాడు. అక్కడ పొరపాటున కాలువలో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం పశువులు ఇంటికి తిరిగి వచ్చినా ఈశ్వరయ్య రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయన కోసం గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం మరోసారి గాలించగా కాలువలో పడి ఉన్న మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పాముకాటుకు ఇద్దరు మృతి

చేజర్ల, సెప్టెంబర్ 28 : మండలంలోని వేర్వేరు గ్రామాల్లో శుక్రవారం పాముకాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఆదూరుపల్లిలో వంకాయల కోతకు వెళ్లిన రమణమ్మ (30)ను పాము కాటువేసింది. ఆమెను తక్షణం నెల్లూరులోని ఓ వ్రైవేటు వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా తూర్పుకంభం పాడు గ్రామంలో ఉపాధి పనులకు వెళ్లిన ఎన్ రామయ్య (55) పాము కాటుకు గురయ్యాడు. బాధితుడిని వెంటనే వైద్యశాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. మండలంలో ఒకే రోజు ఇద్దరు పాముకాటుకు గురై మృతి చెందడంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుల్లో రమణమ్మకు ఏడాది వయస్సు ఉన్న పాప ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే మృతుడు రామయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.