క్రైమ్/లీగల్

గొడ్డలితో భార్యపై దాడిచేసిన భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్థవీడు, సెప్టెంబర్ 28: మతిస్థిమితం లేని భర్త గొడ్డలితో భార్యపై దాడిచేసి గాయపరచిన సంఘటన శుక్రవారం మండలంలోని పాపినేనిపల్లి గ్రామంలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన దొంత పెద్దఅల్లూరయ్య కుమారుడు వెంకటేశ్వర్లుకు కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఐదుగంటల సమయంలో వెంకటేశ్వర్లు ఇంట్లో నిద్రిస్తున్న భార్య రాజేశ్వరిపై గొడ్డలితో దాడిచేసి తలపై, ముఖంపై తీవ్రంగా గాయపరిచాడు. ఈ సంఘటనలో రాజేశ్వరి కన్ను దెబ్బతినగా, రెండు పళ్లు రాలిపోయాయి. కుటుంబసభ్యులు రాజేశ్వరిని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించినట్లు బంధువులు తెలిపారు. ఎస్సై రవీంద్రారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.