క్రైమ్/లీగల్

సెంట్రింగ్ సబ్ కాంట్రాక్టర్ శ్రీను ఆత్యహత్య కేసులో ఇద్దరు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, సెప్టెంబర్ 28: ఒంగోలులోని గుంటూరు రోడ్డులో గల రవిప్రియా మాల్‌కు ఉత్తరం వైపుగల వేస్ట్ మెటీరియల్ స్టోరూంలో ఇటీవల కేబుల్ వైర్‌తో ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్న సెంట్రింగ్ సబ్ కాంట్రాక్టర్ పల్లపు శ్రీను ఆత్మహత్య కేసులో హైదరాబాద్ కు చెందిన ఇద్దరు వ్యక్తులను ఒంగోలు తాలూకా పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం నాడు కోర్టు కు హాజరు పరచగా ఆ ఇద్దరు వ్యక్తులకు కోర్టు రిమాండ్ విధించినట్లు ఒంగోలు తాలూకా పోలీసులు తెలిపారు. శుక్రవారం నాడు ఒంగోలు తాలూకా పోలీసులు అందించిన వివరాలు ఈ విదంగా ఉన్నాయి. గత 18 నెలల నుండి ఒంగోలులోని పాత గుంటూరు రోడ్డు లో గల రవిప్రియ మాల్ లో కందుకూరు పట్టణం కు చెంది న ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న సెంట్రింగ్ సబ్ కాంట్రాక్ట్ పనులు చేసిన పల్లపు శ్రీను పనులు చేసిప్పటికి శ్రీను తోపాటు సబ్ కాంట్రాక్టర్ పనులు చేసిన హైదరాబ్ కు చెందిన రేకు అలియాస్ రేగు రాజు అదే విదంగా , ఒంగోలులోని సమతా నగర్ కు చెందిన మెయిన్ కాంట్రాక్ట్‌ర్ గుమ్మనం పాడు అలియాస్ బొమ్మల వెంకట్రావు అనే వారులు శ్రీను కి పనచేసిన డబ్బులు , మెటీరియల్ తాలూకా డబ్బులు ఇవ్వకుండా వారు ఇద్దరు కలిసి మోసం చేయడంతో మనస్థాపానికి గురైన శ్రీను ఈనెల 13న ఒంగోలులోని రవిప్రయా మాల్ కు ఉత్తరం వైపు గల వేస్ట్ మెటిరీయల్ స్టోర్ రూమ్ లో కేబుల్ వైర్ తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగిందిని పోలీసులు తెలిపారు. కేసునమోదు చేసిన ఒంగోలు తాలూకా పోలీసులు ధర్యాప్తు చేసి గుమ్మంపాడు అలియాస్ బొమ్మల వెంకట్రావు, రేకు అలియాస్ రేగు రాజు అనే ఇద్దరిని గురువారం నాడు అరెస్ట్ చేసి ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్ ఎస్‌ఐ మేడా శ్రీనివాసరావు కోర్టు కు హాజరు పరచగా కోర్టు వారు వారి ఇద్దరికి 15 రోజులు రిమాండ్ విధించినట్లు ఒంగోలు తాలూకా పోలీసులు తెలిపారు.