క్రైమ్/లీగల్

వికటించిన కంటి వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

18 మందికి సీరియస్.. హైదరాబాద్‌కు తరలింపు
* జయ ఆసుపత్రి నిర్వాకం
* గడువుదాటిన కంటి చుక్కలు వేయడంతో తీవ్ర ప్రమాదం
* ప్రభుత్వంపై వెల్లువెత్తిన విమర్శలు

------------------------------------------------------------------------
వరంగల్ క్రైం, సెప్టెంబర్ 28: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకానికి ఆదిలోనే ఎదరుదెబ్బ తగిలింది. హన్మకొండ నగరంలోని జయ ఆసుపత్రిలో కంటి వెలుగు వైద్య శిబిరం వైద్యులు 18 మందికి గడువు దాటిన కంటి మందు చుక్కుల వేయడంతో కళ్లకు తీవ్ర ప్రమాదం ఏర్పడింది. దీంతో ఆసుపత్రి వర్గాలు హుటాహుటిన బాధితులను చికిత్స నిమ్మిత్తం హైదరాబాద్‌కు తరలించారు. నిరుపేద బడుగు బలహీన వర్గాల కోసం అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కంటి వెలుగు పథకంపై విమర్శలు తలెత్తుతున్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన 18 మంది బాధిత కుటుంబాలు జయ ఆసుపత్రి వైద్యుల నిర్వాకంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. జయ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న కంటి వెలుగు పథకం శుక్రవారం 18 మందికి కళ్లు పోయో పరిస్థితి ఏర్పడడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో హన్మకొండ పోలీసులు జయ ఆసుపత్రికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి పంపించారు. ఈ విషయం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెలుగులోనికి రావడంతో కంటి వైద్య శిబిరాలకు వెళ్తేందుకు ప్రజలు జంకుతున్నారు. ప్రభుత్వ చేపట్టిన కంటి వెద్య శిబిరం ద్వారా తమ కళ్లను రక్షించుకోవాలి అనుకున్న ప్రజలకు ఈ సంఘటనతో అనుమానులు రెకేత్తుతున్నాయి. ఇప్పటికైన అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు వైద్య శిబిరాలు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు బాధితులు కోరుతున్నారు.