క్రైమ్/లీగల్

తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, సెప్టెంబర్ 28: బడంగ్‌పేట్‌లోని ఓ రియల్టర్ ఇంటి తాళాలు పగులగొట్టి దాదాపు రూ.20 లక్షల నగదు, 12 తులాల బంగారు నగలను దోచుకెళ్లిన సంఘటన మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సంఘటనకు చెందిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. బడంగ్‌పేట్‌లో నివాసం ఉండే సత్యనారాయణ గౌడ్ కుటుంబ పెద్దలకు బియ్యం ఇవ్వటానికి కుటుంబ సమేతంగా గురువారం మధ్యాహ్నం 11 గంటలకు గగన్‌పహాడ్‌కు వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు సత్యనారాయణ ఇంటికి వచ్చి చూసేసరికి, ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని రూ.20 లక్షలతో పాటు 12 తులాల బంగారం, రాడో చేతి వాచి దొంగతనం అయినట్లు గుర్తించి వెంటనే మీర్‌పేట్ పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి ఏసీపీ గాంధీ నారాయణ, సీఐ నర్సింగ్ యాదయ్య చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి, విచారణ చేపట్టడంతో పాటు సీసీ టీవి ఫుటేజ్‌లను పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పరిగిలో..

పరిగి: పట్టణంలో పట్టపగలు భారీ దొంగతనం జరిగింది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పరిగి టీచర్స్‌కాలనీలో నవీన్‌కుమార్ కిరాయి ఇంట్లో కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నాడు.
నవీన్ కుమార్, అతని భార్య విజయలక్ష్మీ వృత్తిరీత్యా ప్రభుత్వ ఉద్యోగులు. ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి విధులకు వెళ్లి సాయంత్రం 5.30 గంటలకు ఇంటికి చేరుకుంటారు. శుక్రవారం ఉదయం విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తాళం తీసి తలుపు కొద్దిగా తెరిచి ఉంది. నవీన్ కుమార్ అతని భార్య ఇద్దరూ ఇంట్లో చూడగా బీరువా తెరచి ఉంది. బంగారు వస్తువులు పెట్టిన ప్లాస్టిక్ కవర్‌లు కింద పడి ఉన్నాయి. అందులో తొమ్మిది తులాల బంగారం, 15 తులాల వెండి వస్తువులు కనిపించలేదు. పరిగి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ హరిప్రసాద్ వెంటనే సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. చుట్టుపక్కల వారిని విచారించగా ఎటువంటి సమాచారం అందలేదు. క్లూస్ టీం వచ్చి పరిశీలించి సంబంధించిన ఆనవాళ్లను సేకరించారు. పట్టపగలు ఇంటి చుట్టూ జనాలు ఉన్నారు. స్థానికంగా ఉండేవారా? లేదంటే బయటి నుంచి వచ్చారా? సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ చోరీ జరగడంపై కాలనీవాసులు చర్చించుకుంటున్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.