క్రైమ్/లీగల్
యువతి అదృశ్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఘట్‌కేసర్, సెప్టెంబర్ 29: ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఓ వివాహిత మహిళ అదృశ్యం అయిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి లక్ష్మినర్సింహ్మస్వామి కాలనీలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... అన్నోజిగూడ లక్ష్మినర్సింహ్మ కాలనీలో నివాసం ఉంటున్న పరంపాగ వినయ్‌కుమార్ తన భార్య ఇందుశ్రీ(19)తో కలిసి నివాసం ఉంటున్నారు. శుక్రవారం మద్యాహ్నం విధుల నిమిత్తం వినయ్‌కుమార్ వెళ్లగా ఇంట్లో ఇందుశ్రీ ఒంటరిగా ఉన్నట్లు తెలిపారు. సాయంత్రం అయిదు గంటలకు వినయ్‌కుమార్ సోదరుడు ఇంటికి వచ్చి చూడగా తాళం వేసి ఉండటంతో ఫోను ద్వార సమాచారం అందించినట్లు చెప్పారు. వెంటనే ఇంటికి చేరుకున్న వినయ్‌కుమార్ తన భార్య ఆచూకికై స్థానికంగా, బంధు, మిత్రుల వద్ద వెతికినా ఫలితం లేక పోవటంతో శనివారం ఉదయం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్‌స్పెక్టర్ రఘువీర్‌రెడ్డి తెలిపారు