క్రైమ్/లీగల్

నిరంతర కూంబింగ్‌తో టాస్క్ఫోర్స్ పంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి/కల్లూరు, సెప్టెంబర్ 29: ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లపై టాస్క్ఫోర్స్ ఐజీ కాంతారావు ఆధ్వర్యంలో పంజా విసురుతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా స్మగ్లర్ల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సరికొత్త ప్రణాళికలతో ముందుకెళుతున్నారు. శనివారం తెల్లవారుజామున నారావారిపల్లి మార్గంలో టాస్క్ఫోర్స్ ఆర్‌ఐ భాస్కర్, బృందం తన సిబ్బందితో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 4గంటల సమయంలో భీమవరం వద్ద లోడింగ్ జరుగుతున్న విషయాన్ని గుర్తించిన సిబ్బంది వాహనాన్ని చేజింగ్ చేశారు. టాస్క్ఫోర్స్ సిబ్బందిని గమనించిన స్మగ్లర్ వాహనాన్ని కొత్తపేట మీదుగా కల్లూరు వైపుకు మళ్లించడంతో అప్పటికే సమాచారం అందుకున్న కల్లూరు ఎస్‌ఐ విశ్వనాథ నాయుడు తన బృందంతో ఎదురుగా రావడంతో బయ్యారెడ్డిగారిపల్లి వద్ద వాహనాన్ని గుంతలోకి దింపేసి పారిపోయారు. కారును పరిశీలించగా అందులో 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో నారావారిపల్లి, కల్లూరు మార్గంలో స్మగ్లింగ్ అధికంగా ఉందని స్థానిక గ్రామస్థులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి టాస్క్ఫోర్స్ ఐజీ కాంతారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండురోజుల క్రితం ఇదే మార్గంలో ఒక కారు ఎర్రచందనం దుంగలతో వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారని తెలిపారు. తమ సిబ్బంది కూంబింగ్‌లో స్మగ్లర్లను గుర్తించి కారును వెంబడించడంతో కారు అత్యంత వేగంగా గ్రామాల్లో వెళ్లిందన్నారు. ఆ సమయంలో వ్యవసాయం చేసే ప్రజలు అటుగా వస్తే పెనుప్రమాదం జరిగేదన్నారు. అంతేకాకుండా సిబ్బంది వెంబడించిన క్రమంలో కారు పెద్ద గుంతలో దిగిందని, ఆ సమయంలో కారు ముందుభాగం పైకి పడడంతో ప్రమాదం తప్పిందని, అదే కిందకు పడి ఉంటే వాహనం తోలిన వ్యక్తి మృతి చెందే అవకాశం ఉందన్నారు. ఇలాంటి వారిపై స్థానిక గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని టాస్క్ఫోర్స్‌కు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సంఘటనాస్థలాన్ని టాస్క్ఫోర్స్ డీఎస్పీ వెంకటరమణ, ఆర్‌ఐలు చంద్రశేఖర్, మురళి, ఏసీఎఫ్ కృష్ణయ్య, ఎఫ్‌ఆర్‌ఓలు లక్ష్మీపతి, ప్రసాద్ తదితరులు పరిశీలించి, ఆర్‌ఐ భాస్కర్ బృందంను అభినందించారు.
ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం: ఐజీ కాంతారావు
*రెండు సంఖ్యల వాహనాన్ని స్వయంగా పట్టుకున్న టాస్క్ఫోర్స్ ఐజీ
ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపామని ఎర్రచందనం టాస్క్ఫోర్స్ ఐజీ కాంతారావు తెలిపారు. టాస్క్ఫోర్స్, కల్లూరు పోలీసులు శనివారం వేకువజామున జరిపిన జాయింట్ ఆపరేషన్‌లో వాహనంతో సహా రూ: 25లక్షలు విలువైన 12 ఎర్రచందనం దుంగలు పట్టుబడిన సంఘటన పులిచెర్ల మండలం రాయవారిపల్లి పంచాయతీ బయ్యారెడ్డిగారిపల్లి వద్ద చోటుచేసుకుందని టాస్క్ఫోర్స్ ఐజీ కాంతారావు తెలిపారు. అనంతరం వాహనంతో సహా ఎర్రచందనం దుంగలను కల్లూరు పోలీస్టేషన్‌కు అప్పగించారని, కల్లూరు ఎస్‌ఐ విశ్వనాధనాయుడు కేసు నమోదు చేస్తున్నట్లు ఐజీ కాంతారావు తెలిపారు. కల్లూరు సమీపంలో జరిగిన ఘటనా స్థలానికి బయలుదేరిన టాస్క్ఫోర్స్ ఐజీ కాంతారావు భీమవరం దాటిన తరువాత ముందు వెళుతున్న వాహనం ప్రమాదానికి గురయింది. వెంటనే వారిని కాపాడేందుకు యత్నించిన ఐజీ, ఆయన బృందం ప్రమాదానికి గురైన వాహనానికి రెండు నెంబర్లు ప్లేట్లు ఉండడాన్ని గుర్తించారు. వాహనంలో ఉన్న వారికి ప్రథమచికిత్స అందించి విచారణ చేస్తున్నారు. ట్యాక్స్, పర్మిట్ కట్టకుండా, వాహనంలో ఎవరు ఆపకుండా ఉండేందుకు కొందరు దొంగ రికార్డును తయారు చేస్తున్నారని వారిపై టాస్క్ఫోర్స్ విచారణ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీనిపై టాస్క్ఫోర్స్ పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపడతామని ఐజీ కాంతారావు తెలిపారు.