క్రైమ్/లీగల్

ఆదోనిలో ఏటీఎం చోరీయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, సెప్టెంబర్ 30: ఆదోనిలో దొంగలు మరోసారి హాల్‌చల్ చేశారు. పట్టణంలోని ఎంఎం రోడ్డులో ఉన్న ఏటీఎంలోని డబ్బులను దోచుకోవడానికి శనివారం అర్ధరాత్రి ఏటీఎం మిషన్ మొత్తాన్ని పగలగొట్టారు. ఏటీఎంకు అనుసంధానం చేసిన కంప్యూటర్ డిస్క్‌ను కూడా మొత్తం ధ్వంసం చేశారు. ఏటీఎంలోను డబ్బులు దోచుకోవడానికి దొంగలు విశ్వప్రయత్నం చేశారు. కాని వారి ప్రయత్నం ఫలించలేదు. ఏటీఎంను ధ్వంసం చేసినప్పటికీ డబ్బులు దొంగల చేతుల్లోకి వెళ్లలేదు. డబ్బులు ఉన్నా ఏటీఎం భాగం మాత్రం అలాగే ఉండడంతో ఏటీఎంలో ఉన్న రూ. 29 లక్షలు పదిలంగా ఉన్నాయని, దొంగలు డబ్బును ఎత్తుకెళ్లలేదని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. ఎంఎం రోడ్డులో ఉన్న ఏటీఎం ఆయన ఆదివారం పరిశీలించి సీఐలతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటీఎం సెటర్ పై భాగం నుంచి దొంగలు కన్నం వేసి ఏటీఎం రూమ్‌లోకి చొరబడ్డారని, ఏటీఎంలో ఉన్న డబ్బును ఎత్తుకెళ్లేందుకు దొంగలు చేసిన ప్రయత్నం విఫలమైందన్నారు. అయితే బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన తెలిపారు. ఏటీఎంకు కాపాలగా వాచ్‌మెన్ లేడని, అలాగే ఏటీఎం రూమ్‌కు ఉన్న షెటర్‌ను కూడా మూసి వేయలేదని, ఏటీఎంలో నిఘా కెమెరా కూడా ఏర్పాటు చేయలేదన్నారు. ఇదే అదునుగా భావించిన దొంగలు మాటు వేసి ఏటీఎంలోకి చొరబడి మిషన్‌ను ధ్వంసచేసేందుకు విశ్వప్రయత్నం చేశారు. మీషన్ పైభాగం ధ్వంసమైనా డబ్బున్న భాగం ధ్వంసం కాకపోవడంతో చేసేదేమీలేక దొంగలు అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటారని స్థానికుల సమాచారం. కాగా ఏటీఎంలో ఉన్న రూ.29 లక్షలు దొంగలు చేతుల్లోకి వెళ్లలేదని తెలియడంతో పోలీసులు, స్థానికులు ఊపీరి పీల్చుకున్నారు.

చిత్రం..ఆదోని పట్టణంలో దొంగలు ధ్వంసం చేసిన ఎస్‌బీఐ ఏటీఎం