క్రైమ్/లీగల్

రుషికొండ బీచ్‌లో ఐదుగురు గాయత్రి విద్యార్థులు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధురవాడ, సెప్టెంబర్ 30: పోతినమల్లయ్యపాలేం పోలీస్ స్టేషన్ పరిధిలోని రుషికొండ బీచ్‌లో మధురవాడ గాయత్రి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్ధులు గల్లంతవగా వారిలో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరగా ఇద్దరు మృతిచెందారు. పి.ఎం.పాలేం పోలీసులు తెలిపిన వివరాలప్రకారం మధురవాడ గాయత్రికళాశాలలో కంప్యూటర్ సైన్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సామర్లకోటకు చెందిన హరికిరణ్ (18), ఇసిఇ రెండవ సంవత్సరం చదువుతున్న పాలకొల్లుకు చెందిన చేగొండి లీలా పవన్‌కుమార్ (18), మెకానికల్ రెండవ సంవత్సరం చదువుతున్న వొమ్మంగికి చెందిన పాడిశెట్టి దామోదర్, ఇఇఇ రెండవ సంవత్సరం చదువుతున్న తనుకుకు చెందిన పాదాల రేవంత్ రాజా వెంకటేష్, ఇసిఇ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సిహెచ్ నాగవంశీలు ఆదివారం సాయింత్రం రుషికొండ బీచ్‌కు వెళ్లి స్నానానికని సముద్రంలో దిగారు. ఐతే అలల ఉధృతికి వారు ఐదుగురు సముద్రంలోకి కొట్టుకు పోయారు. ఇది గమనించిన గజ ఈతగాళ్లు దామోదర్, రేవంత్, నాగ వంశీలను రక్షించగలిగారు. హరికిరణ్, పవన్‌కుమార్‌లు గల్లంతయ్యారు. కొంత సేపటికి లీలాపవన్ విగత జీవిగా ఒడ్డుకు తిరిగిరాగా హరికిరణ్ మృతదేహం ఇంకా లభ్యం కాకపోవడంతో పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారు. పి.ఎం.పాలేం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.