క్రైమ్/లీగల్

బీమా కాల్వలో పడి బాలుడు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాన్‌గల్, సెప్టెంబర్30: బీమా కాల్వలో పడి బాలుడు గల్లంతయిన సంఘటన పాన్‌గల్ మండల పరిధిలోని చింతకుంట గ్రామ శివారులో జరిగింది. ఎస్‌ఐ తిరుపాజి తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి మండలం చందాపూర్ గ్రామానికి చెందిన తిరుపతయ్య, సుజాత దంపతుల రెండవ కుమారుడు నిఖిల్‌కుమార్(5) అనే బాలుడు కాల్వలో పడి గల్లతయినట్లు తెలిపారు. తిరుపతయ్య తన కుమారుడు నిఖిల్‌ను వ్యవసాయ పొలం దగ్గరికి బైక్‌పై తీసుకేళ్లగా పొలం గెట్టు వద్ద ఉంచి పశుగ్రాసం కొసేందుకు వెళ్ళగా తిరిగి వచ్చేసరికి బాలుడు కనబడకపోవడంతో పరిసరాలతో పాటు ఇంటి వద్ద సమీపంలో గ్రామంలో వేతకగా కనిపించకపోవడంతో కాల్వలో పడి గల్లంతయి ఉండవచ్చన్న అనుమానంతో పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం తెలుపగా వెంటనే వారు అక్కడికి వచ్చారు. ఎస్‌ఐ తిరుపాజీతో పాటు సిబ్బంది, గ్రామస్థులు కాల్వలో వేతికినప్పటికి అచూకి లభ్యం కాలేదని ఎస్‌ఐ తెలిపారు. చీకటి కావడంతో గాలింపును నిలిపి వేశారు. గత ఏడాది తిరుపతయ్య, సుజాత దంపతుల మొదటి కుమారుడు నీటి బాకెట్లో పడి మృతి చెందాడు. ఇప్పటి జరిగిన సంఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరు మున్నీరుగా విలపించారు.