క్రైమ్/లీగల్

పాతకక్షల నేపథ్యంలో యువకుడి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాచర్ల, అక్టోబర్ 1: హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించిన ముద్దాయిని నలుగురు వ్యక్తులు వేటకొడవళ్లతో దాడిచేసి దారుణంగా హతమార్చిన సంఘటన సోమవారం మాచర్ల పట్టణంలో జరిగింది. చెరుకుపల్లి మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన శెట్టిపల్లి ప్రేమ్‌కుమార్ (35) హత్య కేసులో ముద్దాయి. ఐదు సంవత్సరాలు జీవితశిక్ష అనుభవించి నాలుగు నెలల కిందట బయటకు వచ్చాడు. ప్రేమ్‌కుమార్ భార్య జోష్న వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. శిక్ష అనుభవించి బయటకు వచ్చిన ప్రేమ్‌కుమార్ శిరిగిరిపాడు గ్రామంలో భార్య వద్ద ఉంటున్నాడు. సోమవారం పట్టణంలోని గుంటూరు రోడ్డులో గల ఎస్‌వి ఆర్ బార్ అండ్ రెస్టారెంట్‌లో మద్యం సేవించి 3.30 గంటలకు ప్రేమ్‌కుమార్ బయటకు వస్తుండగా పాతకక్షల నేపథ్యంలో బార్ వద్ద కాపుకాసిన నలుగురు వ్యక్తులు అంబాసిడర్ కారులో దిగి వేటకొడవళ్లతో దాడి చేసి ప్రేమ్‌కుమార్ మెడమీద, చేతుల మీద నరికి వేయటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. హత్య చేసిన నిందితులు పారిపోయారు. పట్టణ సీఐ సాంబశివరావు, గురజాల డీఎస్పీ ప్రసాద్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇదిలా ఉండగా హత్య చేసిన నిందితులు అంబాసిడర్ కారులో పారిపోతుండగా రాయవరం జంక్షన్ వద్ద ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా తెలుసుకుని అప్రమత్తమైన పోలీసులు పాలువాయి జంక్షన్ వద్ద కాపు కాశారు. కారు రెంటచింతల మండలం గోలి వైపు వెళ్లటంతో పోలీసులు కూడా వెంటపడ్డారు. కారును వదిలేసి నిందితులు పారిపోతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.