క్రైమ్/లీగల్

అనుమానంతో భార్యను కడతేర్చిన కసాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేటపాలం, అక్టోబర్ 5: అనుమానం పెనుభూతమై పచ్చి బాలింత అయిన భార్యను కడతేర్చిన కసాయి ఉదంతం శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని దేశాయిపేట పంచాయతీ నీలకంఠాపురానికి చెందిన అవ్వారు లీలారావు, పద్మావతి దంపతుల మూడో కుమార్తె భానుమతి (21)ని గత యేడాది అక్టోబర్ 1న ఈపూరుపాలెంకు చెందిన సాదు సాంబశివరావుతో వివాహాం చేశారు. పెళ్లి అయిన కొద్ది రోజులకే భానుమతిని మానసికంగాను, శారీరకంగానూ హింసించడం మొదలు పెట్టాడు. సాంబశివరావుకు అతని తల్లి సహకారం కూడా తోడవడంతో మరింతగా రెచ్చిపోయేవాడు. పలుమార్లు ఈ విషయమై పెద్దలు రాజీ కుదిర్చారు. భానుమతి సీమంతం వేడుకల్లో వివాదం జరగగా ఈపూరుపాలెం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. పోలీసుల కౌనె్సలింగ్‌తో వివాదం సద్దుమనిగింది. కాన్పు కోసం భానుమతిని పుట్టింటికి తీసుకురాగా సాంబశివరావు అప్పుడప్పుడు వచ్చివెళ్లేవాడు. కాన్పు సమయంలో ఆసుపత్రి వద్ధ దగ్గరుండి అన్ని చూసుకున్న సాంబశివరావు కూతురు పుట్టడంతో మనోవేదనకు గురయ్యాడు. 18 రోజుల క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చిన భానుమతి ఆసుపత్రి నుంచి డిచార్జి అయ్యి పుట్టింటికి చేరుకోగా గురువారం అర్థరాత్రి అత్తవారింటికి వచ్చిన సాంబశివరావు అందరూ నిద్రపోయాక భార్యపై హత్యకు పాల్పడ్డాడు. అనంతరం తన ద్విచక్ర వాహనంపై ఈపూరుపాలెం వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం చిన్నారి పాప ఏడుపు విన్న భానుమతి తల్లిదండ్రులు హత్యకు గురైన భానుమతిని చూసి నిర్ఘాంతపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న చీరాల గ్రామీణ సీఐ పి భక్తవత్సలరెడ్డి వేటపాలెం ఎస్సై యు వెంకటకృష్ణయ్య మృతదేహాన్ని పరిశీలించి విచారణ ప్రారంభించారు. ఈపూరుపాలెంలో సాంబశివరావుతో పాటు ఆయన కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకొని భానుమతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. కేవలం 18 రోజులైన పసిపాప తల్లికి దూరం కావడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేసి, నిధింతుడుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.