క్రైమ్/లీగల్

విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసగించిన వ్యక్తికి జైలుశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 8: విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసానికి పాల్పడిన కేసులో నిందితునిపై నేరం రుజువుకావడంతో ఏడాది పాటు జైలుశిక్ష, రూ. ఐదు వేలు జరిమానా విధిస్తూ ఎనిమిదో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కాళేశ్వరరావు మార్కెట్ కాంప్లెక్స్‌లో ఆఫీసు నిర్వహిస్తున్న తారాపేటకు చెందిన షేక్ షాదాబ్(36)పై రెండు చీటింగ్ కేసులు నమోదు కాగా నిందితుడిని 2011 డిసెంబర్ 14న వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కనమూరి సురేష్‌కుమార్ రాజ్ (31) అనే వ్యక్తి 2010లో విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించబడును అనే పత్రిక ప్రకటన చూసి షేక్ షాబాద్‌ను సంప్రదించాడు. సదరు కార్యాలయంలో సంప్రదించిన మీదట మలేషియాలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి తన వద్ద షాబాద్ రూ.85వేలు తీసుకుని మోసం చేశాడని బాధితుడు సురేష్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చెన్నైకి చెందిన బీ బాలాకుమార్ అనే వ్యక్తి కూడా తనకు సింగపూర్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని షాబాద్ తన వద్ద రూ.60వేలు తీసుకుని మోసం చేశాడంటూ ఫిర్యాదు చేయగా పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఈరెండు కేసుల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు షాబాద్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో ప్రాసిక్యూషన్ తరుఫున పోలీసులు ప్రవేశపెట్టిన సాక్షులను విచారించిన మీదట ఈరెండు కేసుల్లోనూ నిందితునిపై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.

చోరీ కేసులో 8మందికి జైలు, జరిమానా

విజయవాడ (క్రైం), అక్టోబర్ 8: ఇంట్లో చోరీకి పాల్పడిన కేసులో ఎనిమిది మంది నిందితులు విచారణలో నేరం ఒప్పుకోవడంతో ఒక్కొక్కరికి 4నెలలు జైలు, రూ.100ల చొప్పున జరిమానా విధిస్తూ 12వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం గన్నవరం పోలీస్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో పాత ఎస్‌బీఐ కాలనీకి చెందిన చిన్న అంజనీకుమార్ ఇంట్లో 2017 జూన్ 29న రాత్రి గుర్తు తెలీని వ్యక్తులు ఇంటి వెనుక హాలు తాళం పగులగొట్టి లోకి చొరబడి నగదు, నగలు అపహరించుకుపోయారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టిన మీదట నిందితులను గుర్తించి మధ్యప్రదేశ్‌కు చెందిన అజయ్ విష్ణు, రాజు, రామదాస్, చెంచల్, విజయ్, ధర్మ, ప్రతాప్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేష్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో నిందితులు నేరం అంగీకరించగా న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.

వీధి విక్రేతలపై అధికార జులుం
* బీసెంట్ రోడ్డులో ఉద్రిక్తత
* హాకర్స్ తొలగింపునకు విఫలయత్నం
* అధికారుల చర్యలను అడ్డుకున్న వామపక్ష నేతలు
విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 8: బీసెంట్‌రోడ్డు అన్సారీ పార్కు వద్ద హాకర్స్ తొలగింపునకు పూనుకున్న వీఎంసీ అధికారుల చర్యతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం సంఘట