క్రైమ్/లీగల్

సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు కుమారుడి ఇంటిపై ఈడీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 8: సీబీఐ మాజీ డైరెక్టర్ కే విజయరామారావు కుమారుడు శ్రీనివాస్ కళ్యాణ్‌రావు నివాసంపై ఈడీ అధికారులు దాడులు చేసి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈడీ అధికారులు శ్రీనివాస్ బంధువులు, స్నేహితుల ఇళ్లపై కూడా దాడులు చేసినట్టు సమాచారం. బెస్టు కాంప్టన్ ఇంజనీరంగ్ ప్రాజెక్టుల ఎండీగా వ్యవహరించిన శ్రీనివాస్ కళ్యాణ్‌రావు పలు బ్యాంకుల నుండి తప్పుడు డాక్యుమెంట్లు ఇచ్చి అక్రమంగా రుణాలు పొందారని, ఈ సందర్భంగా ఆయన తన తండ్రి పేరు వినియోగించుకున్నారని ఆరోపణలు రావడంతో గత ఏడాది సీబీఐ ఆయన ఇంటిపై దాడి చేసి విచారణ జరిపింది. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుండి 124 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకు నుండి 120 కోట్లు, ఆంధ్రా బ్యాంకు నుండి 60 కోట్లు రుణాలు పొందారని తిరిగి వాటిని చెల్లించలేదని సీబీఐ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా శ్రీనివాస్ కళ్యాణ్‌రావు ఖాతా నిరుపయోగంగా మారిందని, రుణాలు తిరిగి చెల్లించడం లేదని 2013 మేలో గుర్తించి చెన్నైలోని నుంగంబాకం పోలీసు స్టేషన్‌లో 2015 అక్టోబర్‌లో కేసు నమోదు చేసింది. తర్వాత ఈ కేసులను సీబీఐకి బదలాయించారు. సీబీఐ దాడుల అనంతరం నేడు ఈడీ దాడులు నిర్వహించింది. అయితే ఈ రుణాలకు సంబంధించి శ్రీనివాస్ పేరు మాత్రమే చెప్పడం సరికాదని ఆయన కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి వరకూ ఈ దాడులు కొనసాగాయి.