బిజినెస్

పత్తిమిల్లు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, మార్చి 2: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని పిడిచెడ్ శివారులో గల ఈశ్వరసాయి కాటన్ ఇండస్ట్రీస్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకొని రూ. 2కోట్ల విలువ చేసే పత్తి దగ్ధమైం ది. ఈ సంఘటనకు సంబంధించి బాదితులు, పోలీసులు, ఫైర్‌స్టేషన్ అధికారులు అందించిన వివరాలిలా ఉన్నాయి. పిడిచెడ్ గ్రామ శివారులో ఈశ్వరసాయి కాటన్ ఇండస్ట్రీస్‌కు ఓ రైతు ఆటోలో పత్తి తీసుకువచ్చాడు. అయితే ఆటో పొగ గొట్టం నుండి నిప్పురవ్వలు ఎగసిపడి అక్కడే కుప్పల్లో ఉన్న పత్తి నుండి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దానికి తోడు ఎండల తీవ్రత తోడవడంతో కాటన్‌మిల్లులోని సుమారు 4వేల క్వింటాళ్ల పత్తి దగ్దం కాగా, సుమారు రూ. 2కోట్ల ఆస్తినష్టం వాటిల్లింది. కాటన్ ఇండస్ట్రీ యజమాని ఉమాపతి ఫైర్‌స్టేషన్‌కు సమాచారం చేరవేయడంతో సిద్దిపేట, శామీర్‌పేటల నుండి 2 ఫైర్ ఇంజన్‌లను రప్పించి సిబ్బందితో మంటలను ఆర్పివేశారు. సుమారు 2 గంటల పాటు సిద్దిపేట ఫైర్ స్టేషన్ అధికారి శ్రావణ్‌వర్మతోపాటు మరో 12 మంది సిబ్బం ది శ్రమించడంతో నిల్వ ఉన్న మరో సుమారు రూ. 20కోట్లకుపైగా విలువ చేసే పత్తిని అగ్నికి ఆహుతి కాకుండా కాపాడారు. ఫైర్‌స్టేషన్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో రూ. కోట్ల విలువ చేసే పత్తిని కాపాడినట్టు యజమాని ఉమాపతి పేర్కొన్నారు.

చిత్రం.. పిడిచెడ్ శివారులోని కాటన్ ఇండస్ట్రీస్‌లో అగ్నికి ఆహుతైన పత్తి