క్రైమ్/లీగల్

సాయం కోరిన మహిళకు టోకరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, అక్టోబర్ 9: విశ్రాంత ఉపాధ్యాయురాలు ఓ సైబర్ నేరస్తుడిని సాయం చేయమని కోరటంతో రూ. 40 వేలు కాజేశాడు. ఈ ఉదంతంపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భవానీపురం హౌసింగ్ బోర్డు ఓల్డ్ ఎంఐజీ కాలనీకి చెందిన నందివాడ రాగవాణి(50) గతంలో ప్రైవేట్ టీచర్‌గా పనిచేసి ఇంటి వద్ద ఉంటోంది. ఏటీఎంలో నగదు డ్రా చేయటానికి భవానీపురం బ్యాంక్ సెంటర్‌లోని ఎస్‌బీఐ బ్యాంక్ ఏటిఎంకు సోమవారం మధ్యాహ్నం వెళ్లింది. ఆ సమయంలో నగదు డ్రా చేసే సమయంలో ఆమె అక్కడే గుర్తు తెలియని ఓ యువకుని సాయం కోరింది. అతను రాగవాణిని ఏమార్చి కార్డును రెండుసార్లు స్వైప్ చేశాడు. డబ్బులు రావటం లేదని ఆమెను బయటకు పంపించేశాడు. అక్కడి నుంచి మరోచోటకు వెళ్లిన ఆమెకు తన ఎకౌంట్ నుంచి రెండుసార్లుగా రూ. 40వేలు డ్రా అయినట్లు మెసేజ్ రావటంతో బ్యాంక్ అధికారులను సంప్రదించింది. బ్యాంక్ చెప్పిన మేరకు తాను మోసపోయినట్లు గ్రహించి మంగళవారం భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏటీఎం సెంటర్‌లోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు.