క్రైమ్/లీగల్

హిందూపురం రూరల్ లో రోడ్డు ప్రమాదం: యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం రూరల్, అక్టోబర్ 10 : హిందూపురం రూరల్ మండల పరిధిలోని వీవర్స్ కాలనీకి చెందిన రాము (30) బుధవారం ద్విచక్ర వాహనంలో వేగంగా వచ్చి నిలబడిన డిప్పర్‌ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ మండలం కిరికెర పంచాయతీ వీవర్స్ కాలనీకి చెందిన రాము ద్విచక్ర వాహనంలో హిందూపురం బైపాస్ రోడ్డులో వెళుతూ రోడ్డు పక్కన నిలబడిన టిప్పర్ కిందకు దూసుకెళ్లాడు. దీంతో తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
సోమందేపల్లి, అక్టోబర్ 10 : మండల కేంద్రంలోని చెరువు వద్ద ఉప్పర నరసింహమూర్తి (35) బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది. నరసింహమూర్తి కొంతకాలంగా హిందూపురంలోని కలర్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేసేవాడు. ఇందులో భాగంగానే మంగళవారం ఉదయం పనికి వెళ్తానని చెప్పి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లిలో గాలించారు. అయితే బుధవారం మధ్యాహ్నం చెరువు సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని శవమై కనిపించాడు. కుటుంబ పోషణ కోసం అప్పులు చేశాడని, వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్య సరోజమ్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.