క్రైమ్/లీగల్

జీబీసీలో గుర్తు తెలియని శవం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విడపనకల్లు, అక్టోబర్ 11 : మండల పరిధిలోని జనార్ధనపల్లి గ్రామం సమీపంలోని జీబీసీ కాలువలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైంది. మృతి చెందిన వ్యక్తి వయసు 50 ఏళ్ల ఉండి, శరీరంపై బనియన్ తప్ప మరేమీ లేదని ఎస్సై తెలిపారు. ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడా, ఆత్మహత్య చేసుకున్నాడా, ఎవరైనా హత్య చేసి వేశారా అనే కోణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం శవానికి కాలవ సమీపంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.
ట్రాక్టర్ బోల్తా..వ్యక్తి మృతి
కంబదూరు, అక్టోబర్ 11 : మండల పరిధిలోని చెర్లోపల్లి గ్రామ సమీపంలో గురువారం ట్రాక్టర్ బోల్తా పడటంతో కురుబ పాపన్న (50) మృతి చెందాడు. రాంపురం నుంచి మర్రిమాకులపల్లికి ట్రాక్టర్‌లో ఇసుక తరలిస్తుండగా చెర్లోపల్లి సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కూలీగా పని చేస్తున్న పాపన్న ట్రాక్టర్ కింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు స్వల్పగాయాలయ్యాయి. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాగిరి రామయ్య తెలిపారు.