క్రైమ్/లీగల్

దొంగనోట్ల ముఠా అరెస్టు ..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోరుమామిళ్ల, అక్టోబర్ 11: కలసపాడు, పోరుమామిళ్ల ప్రాంతాల్లో రహస్యంగా దొంగ నోట్లును చలామణి చేస్తూ ఈ ప్రాంతాలను కేంద్రాలుగా పెట్టుకొని బయటి జిల్లాలకు, రాష్ట్రాలకు ఎగుమతి చేసే దొంగ నోట్ల ముఠా ఎట్టకేలకు పోలీసులకు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే కలసపాడు మండలంలోని లింగారెడ్డిపల్లె గ్రామంలో ఓ కేసు విచారణకై కలసపాడు ఎస్‌ఐ వెంకటరమణ తన సిబ్బందితో వెళ్లగా ఆ గ్రామానికి చెందిన హరి అనే వ్యక్తి అనుమానంగా తిరుగుతుండటంతో అతడిపై అనుమానంతో సోదా చేయగా అతని వద్ద 2000 రూపాయల నోట్లు దొరికినట్లు సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా వచ్చిందని విచారించగా అసలు గుట్టు బయటపడినట్లు తెలిసింది. తీగ లాగితే డొంక కదిలినట్లు విచారణ చేయగా అతనితో పాటు మరో ముగ్గరు యువకులు ఉన్నట్లు సమాచారం. అందులో పోరుమామిళ్లకు చెందిన వ్యక్తిని కూడా అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కంప్యూటర్లు, రెండు కలర్ ప్రింటర్లు, దాదాపు 20 లక్షలకు పైగా రూ. 2000, రూ. 500, రూ. 100లు నోట్లు దొరికాయన్న సమాచారం. వారితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కలసపాడు, పోరుమామిళ్ల కేంద్రాలుగా పెట్టుకొని బయట రాష్ట్రాల్లోని ముంబై, బెంగళూరు, చెన్నై, ఇతర జిల్లాలకు విజయవాడ, గుంటూరు, హైదరాబాదు కేంద్రాల్లోకూడా యథేచ్ఛగా నోట్ల మార్పిడికి పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. వీరు చెన్నైలోని కంప్యూటర్ ప్రింటింగ్, కటింగ్‌పై నోట్ల తయారిపై ప్రత్యేక శిక్షణ పొందినట్లు తెలుస్తుంది. వీరి వద్ద నుండి ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై కలసపాడు ఎస్‌ఐను వివరణ కోరగా ఆయన అందుబాటులో లేనని పై అధికారుల చూచనల మేరకు నడుచుకుంటున్నామన్నారు.